Kidney Disease : మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీ కిడ్నీ డేంజర్ లో పడినట్లే..!
ప్రధానాంశాలు:
Kidney Disease : మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే మీ కిడ్నీ డేంజర్ లో పడినట్లే..!
Kidney Disease : మన శరీరంలో వ్యర్థాలని శుభ్రం చేసే అవయవం కిడ్నీ. కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లే… మన శరీరంలో కిడ్నీ పని చేయకపోతే మన శరీరంలో ఏ అవయవాలు రక్తప్రసరణ జరగదు. ఇక మనిషి డేంజర్ లో ఉన్నట్లే.. కిడ్నీ చెడిపోయినప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు కనబడుతూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోసఫ్ వాస్లోటి ప్రకారం చివరి దశ వరకు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. మేము ఈ సమస్యతో బాధపడుతున్నామని వారికి కిడ్నీలు చెడిపోయాయిని తెలియదు. అయితే ఈ పది సంకేతాలతో మాత్రమే ప్రాథమిక లక్షణాలు గుర్తించి సరైన సమయంలో చికిత్స చేయగలము. అటువంటి సమయాలలో ప్రజలు సరియైన సమయంలో కిడ్నీ సమస్యలను సంబంధించి ప్రారంభ లక్షణాలు గుర్తించండి చాలా ముఖ్యం. మీకు కూడా అధిక రక్తపోటు సమస్య, మధుమేహం మూత్రపిండాల వైఫల్యం లేదా మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లయితే.. కచ్చితంగా మీకు కిడ్నీకి ఒకసారి చెక్ చేయించుకోవాలి. మీ శరీరంలో వచ్చే మార్పులను గుర్తించడం లక్షణాలను చూడడం వల్ల మీకు కిడ్నీలో సమస్య ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు.. మీకు కిడ్నీలో కనిపించే మొదటి లక్షణాల్లో ఒకటి అన్ని సమయాలలో అలసిపోయినట్లు లేదా తక్కువ ఎనర్జీ కలిగి ఉండడం ఉంటుంది.
Kidney Disease 7 లక్షణాలు కిడ్నీ ఉంటే ప్రాబ్లమ్ ఉన్నట్టే
ఇది మూత్రపిండాల వ్యాధికి మొదటి లక్షణం అవ్వచ్చు.. అలాగే మీ పాదాలు చీలమండలు అరికాళ్ళు వాచిపోతాయి. ఆకలిగా అనిపించడం లేదు. తరచుగా కండరాలను వాపులు కూడా కిడ్నీ యొక్క లక్షణాలు అవచ్చు.. వీటిలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యం దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకోవడం మంచిది. అలాగే కళ్ళ చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఇది జరిగినప్పుడు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయట్లేదని.. అవి మూత్రంలో లీక్ అవ్వడం మొదలవుతుంది. ఇవి కిడ్నీ దెబ్బ తినడానికి ముఖ్య లక్షణం. మూత్రపిండాలు రక్తంలో పోషకాలు కనిజాలు సమతుల్యతను కొనసాగించ లేనప్పుడు మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
చర్మం పై దద్దుర్లు దాని లక్షణంగా ఉంటాయి. చర్మం పొడి వాడడం మొదలవుతుంది. ఎముకలు కూడా బలహీనంగా తయారవుతాయి. కిడ్నీలో ఏదైనా లోపం ఉంటే మూత్రంలో కొన్ని ఇతర లక్షణాలు కూడా కనబడతాయి. తరచుగా మూత్రంలో రక్తం రావడం లాంటి సమస్య కూడా వస్తుంది. అలాగే మీరు నిద్రించడానికి ఇబ్బంది పడుతుంటే మీకు తగినంత నిద్ర లేకపోవడం కూడా మరో లక్షణం అవ్వొచ్చు.. నిజానికి మీ మూత్రపిండాలు రక్తాన్ని బాగా ఫిల్టర్ చేయనప్పుడు టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటికి వెళ్ళడానికి బదులుగా రక్త ప్రవాహంలోకి ప్రవేశించడం మొదలవుతుంది. దీని వలన నిద్ర భంగం ఏర్పడుతుంది. అంతేకాదు బాత్రూంకి వెళ్ళాలంటే తరచుగా రాత్రంతా లేవలసి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ మీ శరీరంలో కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి వెంటనే చికిత్స చేయించుకోవడం చాలా అవసరం..