Diabetes : కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త పడాల్సిందే!
Diabetes : ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందికి చక్కెర వ్యాధి వస్తోంది. భారత్‌లో ఈ సమస్యతో అనేక మంది బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువైతే డయాబెటిస్ బారిన పడతాం. మధుమేహాన్ని నియంత్రించడం అంటే రక్తంలోని చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడమే. బాడీలోని గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ సమస్య వస్తుంది. డయాబెటిస్ హెచ్చరిక సంకేతాలు అనేక రకాలుగా ఉంటాయి. మధుమేహం సమస్య ఉన్నప్పుడు రోగి ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేడు. లేదా అతి తక్కువ పరిమాణంలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ అనేది సాధారణంగా ప్యాంక్రియాస్ ద్వారా విడుదలయ్యే హార్మోన్. టైప్ 1 మధుమేహం ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు.
అదే సమయంలో టైప్ 2 డయాబెటిస్, ఇన్సులిన్ చాలా తక్కువ పరిమాణంలో తయారు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి, ఇన్సులిన్ అధిక పరిమాణంలో అవసరం అవుతుంది. అయితే డయాబెటిస్ సమస్యను చాలా మంది గుర్తించడంలో విఫలం అవుతుంటారు. తద్వార ఈ సమస్యతో ప్రాణాప్రాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉంటుంది.మనకు డయాబెటిస్ సమస్య ఉందా లేదా అనేది కళ్ళ ద్వారా తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో కనిపించే కొన్ని లక్షణాతో మనకు మధుమేహం ఉందా లేదా అనేది చెబుతారు. కళ్లు అస్పష్టంగా కనిపిస్తే అది మధుమేహానికి సంకేతం. ఇది కంటిశుక్లం రావడానికి దారి తీస్తుంది. మధుమేహం రోగుల్లో కంటి శుక్లం సమస్య రావడం చాలా మందిలో చూసే ఉంటాం. డయాబెటిస్ పేషెంట్లలో ఈ సమస్య ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది.
గ్లకోమా కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇది కళ్ల నుండి నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇది వస్తుంది. దీంతో కళ్లపై ఒత్తిడి పడుతుంది. ఇది కళ్లలోని నరాలు, రక్త కణాలను దెబ్బతీస్తుంది. మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో గ్లకోమా వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అటు వంటి పరిస్థితిలో తలనొప్పి, కంటి నొప్పి, కళ్ళు మసకబారడం లేదా నీరు కారడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే అది గ్లకోమా. ఈ గ్లకోమా డయాబెటిస్‌కు కూడా దారి తీయవచ్చుచ్చు. డయాబెటిక్ రెటినోపతి.. మధుమేహం రెటినోపతి అనేది రక్తంలో చక్కెరతో బాధపడుతున్న వ్యక్తి రెటీనాపై ప్రభావం చూపే సమస్య. ఇది రెటీనాకు రక్తాన్ని తీసుకువెళ్ళే చాలా సన్నని సిరలు దెబ్బతినడం వలన సంభవిస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, వ్యక్తి అంధత్వానికి గురవుతారు.