Kokilaksha Plant : ఈ చెట్టు కనిపిస్తే అస్సలు వదలకండి.. ఎవ్వరికీ చెప్పకుండా ఇంటికి తెచ్చుకోండి..!
Kokilaksha Plant : కోకిలాక్ష చెట్టు అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు విని ఉండకపోవచ్చు కానీ.. ఈ చెట్టును మాత్రం మీరు చూసే ఉంటారు. ఎందుకంటే.. ఈ చెట్టు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. మీ ఇంటి పేరట్లో.. రోడ్డు మీద, అడవిలో ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఈ చెట్టును చూసి మనం పిచ్చి చెట్టు అని అనుకుంటాం. కానీ.. అది పిచ్చి చెట్టు కాదు.. ఎన్నో ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్న చెట్టు అని మీకు తెలిస్తే.. దాన్ని ఎవ్వరికీ చెప్పకుండా మీ ఇంటికి తీసుకెళ్తారు. ఇంతకీ ఆ చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? ఎందుకు దీనికి ఆయుర్వేదంలో అంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం రండి.
కోకిలాక్ష చెట్టునే నీటి గొబ్బి చెట్టు అని కూడా పిలుస్తారు. దీన్ని ఆయుర్వేదంలో ఇక్షురా, ఇక్షుగంధ, కల్లి అని కూడా పిలుస్తారు. ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ మొక్కలోని ఆకులు, విత్తనాలు, వేర్లు అన్నీ ఆయుర్వేద గుణాలను కలిగి ఉన్నవే. వీటని చాలా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. అయితే.. ఈ చెట్టును చాలామంది కేవలం కలుపు మొక్కగానే చూస్తారు.
Kokilaksha Plant : పురుషులకు దివ్యౌషధంలా పని చేస్తుంది ఈ మొక్క
నిజానికి.. ఈ చెట్టు పురుషులకు దివ్యౌషధం. ఎందుకంటే.. ఇది పురుషుల యవ్వనాన్ని కోల్పోకుండా చేస్తుంది. పురుషుల్లో శక్తి సామర్థ్యాలను పెంచుతుంది. అలాగే.. పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ లేవల్స్ ను ఈ చెట్టు పెంచుతుంది. అందుకే.. మగవారికి ఈ మొక్కను ఎక్కువగా వాడటానికి సూచిస్తుంటారు ఆయుర్వేద నిపుణులు. అలాగే.. షుగర్ తో బాధపడుతున్నవాళ్లు కోకిలాక్ష ఆకులను నిత్యం తీసుకుంటే.. రక్తంలోని చక్కెర లేవల్స్ సమానంగా ఉంటాయి.
స్త్రీలలో సంతాన సమస్యలు ఉన్నవాళ్లకు కూడా ఈ చెట్టు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఈ మొక్క ఆకులను పొడి చేసి.. ఆముదంతో కలిపి వేడి చేసి నడుముకు రాసుకుంటే.. నడుముకు సంబంధించిన ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అలాగే.. శరీరంలో ఉన్న అధిక వేడిని కూడా తగ్గించేందుకు ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. కోకిలాక్ష గింజలను నీటిలో నానబెట్టి.. దాంట్లో కాసింత చక్కెర కానీ తేనె కాని వేసి తాగితే శరీరంలో ఉన్న వేడి మొత్తం పరార్ కావాల్సిందే. అలాగే.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవాళ్లు.. మానసిక ప్రశాంతత లేనివాళ్లు.. చెట్టు వేర్లను తలకు కట్టుకోవాలి. ఆ వేర్లు మెదడుకు ప్రశాంతతను చేకూర్చుతాయి. అలాగే.. నిద్రలేమి సమస్య కూడా పోతుంది. వాత పిత్త సమస్యలకు కూడా ఈ మొక్క చెక్ పెడుతుంది.
ఇది కూడా చదవండి ==> షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
ఇది కూడా చదవండి ==> పరగడుపున మంచి నీళ్లు తాగితే శరీరంలో ఏమౌతుందో తెలిస్తే అస్సలు ఆగరు..!
ఇది కూడా చదవండి ==> రోజూ తినే అన్నం దగ్గరే మనం చాలా తప్పు చేస్తున్నాం.. ఆ ఆహారమే ఎంత చెడు చేస్తోందో తెలుసుకోండి..!
ఇది కూడా చదవండి ==> అల్లాన్ని తెగ తినేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం..!