Diabetes : మెంతులు చేసే మేలు తెలిస్తే షుగర్ పేషెంట్లు ఎగిరి గంతేస్తారు…
Diabetes : ఆయుర్వేదంలో మెంతులు కు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం వాడే వంటల్లో ముఖ్యమైన దినసు మెంతులు. ప్రతిరోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మనం మెంతులను వాడుతాం. మెంతుల్లో ఉండే ఆ చేదే మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూడు చెంచాల మెంతులను ఒక గ్లాసు నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం తగ్గిపోతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక చెంచా మెంతిపొడి తీసుకుంటే షుగర్ వ్యాధిని నివారించవచ్చు.
రెండు లేదా మూడు చెంచాల మెంతులను నానబెట్టి తినడం వలన కడుపులో నొప్పి తగ్గుతుంది. ఒక చెంచా మెంతిపొడి పాలల్లో కానీ నీళ్లలో కానీ కలిపి తీసుకోవడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.అలాగే విరోచనాలు రక్త విరోచనాలతో బాధపడేవారు స్పూన్ మెంతిపొడిని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే విరోచనాలు తగ్గిపోతాయి. మజ్జిగతో మెంతి పొడి తీసుకోవడం వలన కడుపులో మంట తగ్గుతుంది.ఇలా తాగడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్లో తగ్గించుకోవచ్చు. తెల్లబట్ట సమస్య ఉన్నవారు మెంతులు కాగిన నీటితో జననేంద్రియాలు శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒక కప్పు బియ్యం లో రెండు స్పూన్ల మెంతులు వేసి ఉడికించి తినడం వలన రక్తం లేమి సమస్య నుండి దూరం చేస్తుంది. పీరియడ్ సమయంలో స్త్రీలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. పురుషుల అంగస్తంభన వంటి వాటికీ ఔషధంగా పనిచేస్తుంది.
మెంతులు పురుషులు రోజు తీసుకోవడం వలన వీర్య కణాల వృత్తిని పెంచుతుంది. మెంతులు అజీర్ణ సమస్యను దూరం చేస్తాయి. మానవులను అత్యంత ఉత్సాహవంతులుగా చేస్తాయి… మెంతులు రాత్రి సమయంలో నానబెట్టి ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన అధిక బరువు తొందరగా తగ్గుతారు. అలాగే అజీర్తి సమస్యలు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మెంతులను వాడినట్లయితే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు..