Health Benifits : కండ చక్కెర వల్గ కల్గే లాభాలు తెలిస్తే… ప్రతిరోజూ మీరే తింటారు!
Health Benifits : కండ చక్కెరను సాధారణంగా కడి చక్కెర, మిశ్రీ అని కూడా పిలుస్తారు. ఇది శుద్ధి చేయని చక్కెర రూపం. సాధఆరణ చక్కెర కంటే తక్కువ తీపిదనాన్ని కల్గి ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా పోలిస్తే… ఎంతో అత్యుత్తమమైనది. ఇది చెరకు రసం లేదా తాటి కల్లు నుండి తయారు చేయబడుదుంతి. ఈ కండ చక్కెర లేదా తాటి చక్కెర బోలెడు పోషకాలను కల్గి ఉంటుంది. మరి వీటి వల్ల కల్గే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నారంటే ఇక ఇే వాడటం మొదలు పెడతారు. కండ చక్కెరలో అవసరమైన విటామిన్లు, ఖనిజాలు మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
మాంసాహారంలో మాత్రమే లభించే విటామిన్ బి12 కండ చక్కెరలో లభిస్తుంది. కాబట్టి శాఖాహారులు కండ చక్కెరను తీసుకోవడం వల్ల బి12 విటామిన్ ను సులువుగా పొందవచ్చు. కండ చక్కెర ఆరోగ్య ప్రయోజనాలను చూడండి మరి. భోజనం చేసిన తర్వాత కొద్ది పాటి కండ చక్కెరను నోట్లో వేసుకుని చప్పరించి తినడం వల్ల శాశ్వత మరియు తిన్న ఆహార పదార్థాలకు సంబంధించిన వాసనను తొలగించి నోటికి తాజాదనాన్ని చేకూరుస్తుంది. అలాగే పళ్లలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు చిన్న చిన్న మూలాలు కూడా కండ చక్కెరను తినేటప్పుడు పళ్ల సంధుల నుండి బయటకు వచ్చేస్తాయి. తద్వరా శ్వాసకు తాజాధనం చేకూరుస్తుంది.గొంతులో సూక్ష్మ క్రిముల వల్ల దగ్గు మరియు జ్వరం వచ్చినప్పుడు కండ చక్కెరను తీసుకోవడం వల్ల గొంతుకు మంచి ఉపశమనం ఇస్తుంది.
అలాగే కండ చక్కెరను నీటిలో కలిపి తాగడం వల్ల చలువ చేసి జ్వరం తాలూకూ ఉష్ణాన్ని అణిచివేస్తుంది. నల్ల మిరియాల పొడి, నెయ్యి, పొడిగా చేసుకున్న కండ చక్కెర మూడింటిని బాగా కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల తొందరగా ఫలితం ఉంటుంది. అలాగే దగ్గు, జ్వరం, గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని కల్గిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. జీర్ణ క్రియకు కూడా బాగా సాయపడుతుంది. అంతే కాకుండా వేడి వల్ల ముక్కు నుండి వచ్చే రక్త స్రావాన్ని ఆపుతుంది. అలాగే మొదడుకు చాలా మంచి చేస్తుంది. పాలిచ్చే తల్లులు కండ చక్కెరను తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే కంటిలో శుక్లం ఏర్పడకుండా ఉండటానికి కండ చక్కెరను తీసుకోవడం మంచిది. గుడిలో ప్రసాదాల్లో, శుభ కార్యాల్లో, ఆయుర్వేద వైద్యంలో అలాగే హోటళ్లు, రెస్టారెంట్లలో కండ చక్కెరను విరివిగా ఉపయోగిస్తారు.