Health Tips : రాత్రి పూట ఇలా భోజనం చేసి చూడండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
Health Tips : రాత్రి పూట మనం ఇష్టమొచ్చిన సమయంలో భోజనం చేస్తుంటాం. ఒక్కో రోజు ఒక్కో టయానికి తింటుంటాం. ఒక రోజు రాత్రి ఎనిమిది గంటలకు, మరో రోజు తొమ్మిది, పది గంటలకు ఆరగిస్తాం. లేట్ నైట్ అంటే 11, 12 గంటలకు, ఆ తర్వాత కూడా తినేవాళ్లూ ఉన్నారు. అయితే ఇలా ఒక పద్ధతంటూ లేకుండా ఎప్పుడు ఆకలైతే అప్పుడు తింటే కుదరదు. ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం వస్తుంది. ఒంట్లో చక్కెర స్థాయి పెరుగుతుంది. జీర్ణక్రియ క్రమం తప్పుతుంది. తిన్నది అరగక కడుపుబ్బరంతో బాధపడాల్సి ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. పొద్దున్నే విసర్జన సాఫీగా జరగదు. తిన్నది ఒంటబట్టక రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటిగా రోగాలు చుట్టుముడతాయి. కాబట్టి రాత్రి పూట ఎప్పుడు ఎలా ఎంత తినాలో తెలుసుకోవటం ముఖ్యం.

more health benefits with early dinner
ఆలస్యం అమృతం కాదు..
మనం రాత్రి పూట సహజంగా పదీ పదకొండు గంటలకు పడుకుంటాం కదా. దానికి కనీసం రెండు గంటల ముందైనా తినాలి. రోజూ ఒకే సమయానికి, సరిపోను భోజనం చేయాలి. ఎక్కువ, తక్కువ తినొద్దు. ఇలా చేస్తే పడుకోవటానికి ముందే.. తిన్నదాంట్లో సగం వరకు అరుగుతుంది. మిగతాది నిద్రపోయాక జీర్ణమవుతుంది. పడుకున్న తర్వాత జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది కాబట్టి తిన్నది మొత్తం నిద్రలోనే అరగటం జరగని పని. ఫలితంగా అజీర్తితో ఆపసోపాలు పడాలి.
ఆసుపత్రిలో చేరాలి.. : Health Tips
బాడీలో షుగర్ లెవల్స్ పెరిగితే బయటి నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికోసం హాస్పిటల్ లో చేరి కనీసం రెండు మూడు రోజులైనా ఉండాలి. దానివల్ల డబ్బు ఖర్చవుతుంది. టైమ్ వేస్ట్ అవుతుంది. ఇన్సులిన్ మన శరీరంలోనే సహజంగా ఉత్పత్తి కావాలంటే రాత్రి పూట త్వరగా తినాలి. తద్వారా నిద్ర కూడా బాగా పడుతుంది. ఆలస్యంగా భోజనం చేస్తే అది అరగకుండా పొట్టలో అలాగే ఉండిపోతుంది. దీంతో కడుపు నొప్పిగా అనిపించొచ్చు. ఎసిడిటీ రావొచ్చు. రాత్రి పూట త్వరగా తినటం వల్ల ఒంట్లో వేడి సైతం తగ్గుతుంది. బాడీ టెంపరేచర్ పెరిగితే ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.

more health benefits with early dinner
భూమికి దగ్గరగా..
మన శరీరంలోని జీవ గడియారం చక్కగా పనిచేయాలంటే రాత్రి పూట తొందరగా తినాలి. ఉదయం త్వరగా అంటే ఐదు గంటల కల్లా లేవాలి. కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి. తర్వాత ఒక గంటసేపైనా ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల బాడీ పనితీరు భూవాతావరణానికి అనువుగా, ప్రకృతిసిద్ధంగా ఉంటుంది. శరీరంలోని వ్యవస్థలన్నీ బయో క్లాక్ ప్రకారం నడుచుకుంటాయి. రాత్రి పూట వేళకు తినేవాళ్లకు ఒంట్లో కొవ్వు కంట్రోల్ లో ఉంటుంది. అప్పటికే ఫ్యాట్ ఉన్నోళ్లకు కరిగిపోతుంది. ఫలితంగా అధిక బరువు సమస్య ఎదురవదు.

more health benefits with early dinner