Bad Smell Tips : వేసవిలో చమటలు పట్టి మీ శరీరం నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుందా… స్నానం చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి…?
ప్రధానాంశాలు:
Bad Smell Tips : వేసవిలో చమటలు పట్టి మీ శరీరం నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుందా... స్నానం చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి...?

Bad Smell Tips : వేసవిలో చమటలు పట్టి మీ శరీరం నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుందా… స్నానం చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించండి…?
Bad Smell Tips : ఎండాకాలం వచ్చిందంటే శరీరం అధిక వేడి వల్ల చెమటలు పడతాయి. దీనివల్ల శరీరం దుర్వాసన వస్తుంది. ఒక్క రోజు స్నానం చేయకపోయినా, కొందరికి శరీరం చెమట వాసన వస్తుంది. వారి దగ్గర నిలబడాలంటేనే, అసహ్యం అనిపిస్తుంది. దుర్వాసనని తట్టుకోలేం. వెంటనే పక్కకెళ్ళిపోతాం. శరీరం దుర్వాసన రావటం వలన మనం పదిమందిలో ఉండలేం. కాబట్టి శరీరాన్ని చమట నుండి, దుర్వాసన నుండి కాపాడుకోవడానికి కొన్ని పెర్ఫ్యూమ్స్ ని కూడా ఉపయోగిస్తుంటారు. కొంత మందికి శరీరం తీరు స్నానం చేసినా కూడా శరీరం యొక్క దుర్వాసన పోదు. పర్ఫ్యూమ్స్ ని వాడటం వలన దుర్వాసన మరింత ఎక్కువ అవుతుంది. ఫర్ఫ్యూమ్స్ కి బదులు మీరు కొన్ని గృహ వస్తువుల ఉపయోగించి మీ శరీర దుర్వాసనని తొలగించుకోవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు.
Bad Smell Tips : ఎండాకాలంలో వేడి వల్ల చెమటలు పడతాయి. ఉక్కపోత ఎక్కువ అయిపోతుంది. చెమటలతో తడిసిపోతుంది. అప్పుడు శరీరం నుంచి దుర్వాసన ప్రారంభమవుతుంది. చెమట వాస వచ్చే వ్యక్తుల దగ్గర ఎక్కువసేపు ఉండలేం. చెమట వాస వచ్చే వ్యక్తులు నలుగురిలో ఉండలేరు. చెమట వాసన దాచటానికి కొందరు, మార్కెట్లలో కొన్ని పెర్ఫ్యూమ్స్ ని ఉపయోగిస్తుంటారు. పర్ఫ్యూమ్స్ కి వదులు కొన్ని గృహ వస్తువులను వినియోగించి మీ శరీర దుర్వాసనని పోగొట్టుకోవచ్చు. అది ఎలా అని తెలుసుకుందాం…
ఆయుష్ వైద్యుడు డాక్టర్ రాస్ బిహారి తివారీ మాట్లాడుతూ, సవిలో చెమటలు పట్టడం సాధారణ విషయమే కానీ, ఈ చెమట త్రీవ్రమైన వాసనను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది, ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతారు. శరీరంలో ఇటువంటి చెడు దుర్వాసన ఎందుకు వస్తుంది అనే విషయం డాక్టర్ రాస్ నిహారితివారి మాట్లాడుతూ.. చెడు ఆహారపు అలవాట్లు, బ్యాక్టీరియా పెరుగుదల, హార్మోన్ల అసమతుల్యత, పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల శరీరం దుర్వాసన వస్తుందని ఆయన తెలిపారు. పెర్ఫ్యూమ్స్ కు బదులు వేపను ఉపయోగించి ఈ దుర్వాసనను తొలగించవచ్చని ఆయన అన్నారు. వేప శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేసి బ్యాక్టీరియాను చంపుతుందని ఆయన చెప్పారు.
పూర్వకాలంలో వేపాకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేసేవారు. ఈనాటికి కూడా కొందరు పాటిస్తున్నారు. కొందరు దీన్ని కొట్టి పడేస్తున్నారు. ఆ రోజుల్లో బాలింతలకు స్నానం చేయించాలి అంటే వేప ఆకులు వేసిన నీటితో స్నానం చేయించేవారు. అలా చేయడం వల్ల బిడ్డకు తల్లికి ఆరోగ్యం బాగుంటుంది అని వాళ్ళ భావన. వేపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చెమట ద్వారా ఉత్పత్తి అయ్యే దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియాలను తొలగిస్తాయని డాక్టర్ చెప్పారు. దీనికోసం, మీరు రోజు స్నానం చేసే నీటిలో వేపాకులను కలిపి స్నానం చేయవచ్చు. చేస్తే శరీర దుర్వాసన తగ్గిపోతుంది. చర్మం ఇన్ఫెక్షన్ నుంచి రక్షించబడుతుంది. ఇక వేప ఆకుల రసం తాగటం వల్ల శరీరం లోపలి నుండి విషయాన్ని బయటకు పంపవచ్చు. దీనివల్ల దుర్వాసన శరీరం నుంచి మూలం నుండి నిర్మూలించబడుతుంది. చెమట పట్టే ప్రదేశాలలో వేప నూనెను పూయటం వల్ల కూడా చెమట వాసన తగ్గుతుందని ఆయన తెలిపారు.
ప్రస్తుత కాలంలో ప్రజలు సహజ చికిత్సల వైపు మొగ్గు చూపుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వేప సంబంధించిన ఉత్పత్తులకు డిమాండ్ చాలా పెరిగిపోయింది. రసాయన రహిత మార్గంలో శరీర దుర్వాసన తగ్గించటంలో సహాయపడే వేప ఆధారిత సభ్యులు, బాడీ వాష్ లు, డియోడరెంట్ లు మార్కెట్లలో అందుబాటులోకి వచ్చాయి. శరీర దుర్వాసనను తొలగించుటకు బాహ్య చర్యలే కాదు అంతర్గత గంగా కూడా శుభ్రంని పాటించాలి. అంతేకాదు ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి, ఏ పనులు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరాన్ని సహజంగాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు.