Weight loss : ఈ 5 జ్యూస్ లతో నెలరోజులలో బరువు తగ్గడమే కాదు.. నాజుకైన నడుము మీ సొంతమవుతుంది..!!
Weight loss : చాలామంది ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత కూడా అలాంటి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ ప్రయత్నం ఆపుతూ ఉంటారు. అయితే వీటికి కారణాలు పరిమితికి మించి ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ ఈ ఆహార మార్పులే దీనికి కారణమని పోషక ఆహార నిపుణులు తెలుపుతున్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే బరువు ఎక్కువ ఉన్నవాళ్లు ఎక్కువగా ఆరోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే లావు ఉన్నవారిలోను హార్ట్ ఎటాక్ డయాబెటిస్ అస్తమ బీపీ లాంటి ఎన్నో సమస్యలు వ్యాపిస్తుంటాయి.
కావున సాధ్యమైనంతవరకు మీ శరీరాన్ని వయసుకు తగిన విధంగా బరువు తక్కువగా ఉండడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ బరువు తగ్గడం కోసం కొన్ని రకాల జ్యూస్ల్ ను తాగడం వలన కొద్ది రోజులలోనే సన్నబడతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ జ్యూస్లలో ఉండే పోషకాలు శరీర బరువు తగ్గడానికి ప్రేరేపిస్తాయని దానివలన ఈ జ్యూస్ తాగితే చాలా మంచిదని చెప్తున్నారు. మరి బరువు తగ్గడానికి ఉపయోగపడే జ్యూస్ లు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… *గోధుమ గడ్డి జ్యూస్:
ప్రతిరోజు ఉదయాన్నే కాఫీకి బదులు గోధుమ గడ్డి జ్యూస్ తాగితే తొందరగా బరువు తగ్గవచ్చు. ఈ గోధుమ గడ్డిని ఇంట్లోనే ఈజీగా తయారు పెంచుకోవచ్చు.
ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటికి వెళ్లిపోయి త్వరగా సన్నగా అవుతారు.. *కరివేపాకు జ్యూస్: కరివేపాకు ఆరోగ్యానికి చేసే మేలు చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో దీనిని వినియోగిస్తూ ఉంటాం. అయితే కరివేపాకు కూరల్లో కాకుండా డైరెక్ట్ గా జ్యూస్ చేసుకొని తాగితే తొందరగా సన్నబడతారు. దీనికోసం గుప్పెడు కరివేపాకు గ్లాస్ నీళ్ళల్లో వేసి మరిగించుకోవాలి. దీనిలో ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ నిమ్మరసం వేసి కలిపి త్రాగాలి. కరివేపాకులో ఉండే అమైనో ఆమ్లాలు పొట్టలోని కొవ్వును కరిగించడానికి ఉపయోగపడతాయి.. *బీట్రూట్, క్యారెట్ జ్యూస్: ఆరోగ్యానికి ఈ జ్యూస్ చాలా మంచిది. రోజు ఉదయాన్నే టిఫిన్ సమయంలో ఒక బీట్రూట్ రెండు క్యారెట్లు కలిపి జ్యూస్లా
తయారు చేసుకుని తీసుకోవాలి. దీనిలో ఉండే ఫైబర్ విటమిన్ ఏ,సి అధిక బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.. *పుచ్చకాయ జ్యూస్: పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో తినాలనే కోరిక తగ్గి త్వరగా సన్నబడతారు. నిత్యం ఉదయాన్నే పుచ్చకాయ జ్యూస్ ను తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.. *బొప్పాయి జ్యూస్: నిత్యం ఉదయం టిఫిన్ కి బదులుగా 30 జ్యూస్ తాగడం వలన అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ పొట్టలు కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది..