Health Tips : డయాబెటిస్, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే మీ డైట్ లో బెండకాయని చేర్చుకుంటే చాలు…!!
Health Tips : మనం రోజువారి వంటలలో ఎన్నో కూరగాయలను వండుతూ ఉంటాం.. అయితే ఈ కూరగాయలలో కొలెస్ట్రాల్ అలాగే డయాబెటిస్ కు చెక్ పెట్టే కూరగాయ బెండకాయ. బెండకాయ కూర అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ బెండకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకి ఒక సూపర్ ఫుడ్. దీనిలో ఉండే పోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియంతో పాటు తక్కువ క్యాలరులు ఫైబర్ అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. ఈ కూరగాయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. డయాబెటిస్ రోగులు అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడేవారుకి బెండకాయ ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.. ఇప్పుడు వేసవికాలం రాబోతుంది.
ఈ సీజన్లో శరీరానికి కావలసిన నీటితోపాటు ఎన్నో పోషకాలు కూడా కావాలి. ఈ ఎండాకాలంలో అధికంగా కనిపించే కూరగాయ బెండకాయ దీంట్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఆకలిని తగ్గిస్తుంది. 2011లో జనరల్ ఆఫ్ ఫార్మసీ అండ్ బయోడేడ్ సైన్స్ లో పరిశోధనలు డయాబెటిస్ ఎలుకలకు నేలపై ఉన్న బెండకాయ గింజలను తినడం వలన వాటి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాయని పరిశోధకులు తెలుసుకున్నారు. దాదాపు పది రోజులపాటు బెండకాయ గింజలను వాటికి ఆహారంగా అందించి ఈ విషయాన్ని తెలుసుకున్నారు.. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది : షుగర్ వ్యాధిగ్రస్తులలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అలాగే మనం తినే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంచడానికి ఈ ఫైబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. బెండకాయలు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఉండే పెట్ ఎంజామై చెడు కొలెస్ట్రాల్ను నివారించడంతోపాటు మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది. దాని ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కణాలకు అక్షికరణ నష్టాన్ని నివారిస్తుంది. అలాగే క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడేస్తుంది.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.. బెండకాయలో అధిక మొత్తంలో నీటిలో కరిగే కరగని ఫైబర్లు కలిగి ఉంటుంది. కావున జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. బెండకాయలు ఫైటో కెమికల్స్ అండ్ ఆక్సిడెంట్లు ,విటమిన్ సి, పోలేట్, ప్రోటీన్, పొటాషియం లాంటి ఎన్నో పోషకాలు దీనిలో అధికంగా ఉంటాయి. ఇవి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. కావున బ్లడ్ షుగర్ ఎప్పుడు కంట్రోల్ లో ఉంటుంది.