Kidney Stones : కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kidney Stones : కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి…??

 Authored By ramu | The Telugu News | Updated on :1 November 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Kidney Stones : కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా... రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి...??

Kidney Stones : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. ఈ సమస్యల్లో ఒకటి కిడ్నీ స్టోన్స్. అయితే ఈ సమస్య నుండి త్వరగా ఉపశమన పొందాలి అంటే ప్రతిరోజు ఆరెంజ్ జ్యూస్ తాగితే మంచిది అని నిపుణులు అంటున్నారు. ఈ ఆరేజ్ జ్యూస్ అనేది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ సి మరియు పొటాషియం, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలు మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అలాగే దీనిలో విటమిన్ బి 9 మరియు ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి…

నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, ప్రతి నిత్యం రెండు గ్లాసుల ఆరంజ్ జ్యూస్ తాగటం వలన రక్తపోటు సమస్య అనేది దరి చేరకుండా ఉంటుంది. ఇది శరీరంలోని ఆక్సీజన్ తో కూడిన రక్త ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. అంతేకాక ఇది గుండె సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అలాగే ఈ ఆరెంజ్ అనేది కిడ్నీలో రాళ్లను కూడా తొలగిస్తుంది. ఈ నారింజ రసంలో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. దీనిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ అనేది మూత్రంలో pH స్థాయిలను నిర్వహిస్తుంది. అలాగే మూత్రపిండంలో రాళ్లు రాకుండా చూస్తుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ తాజా ఆరెంజ్ జ్యూస్ తాగితే కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.

Kidney Stones కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి

Kidney Stones : కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా… రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి…??

కిడ్నీలో రాళ్లు అనేవి రెండు రకాలు. వీటిలో మొదటిది కాల్షియం ఆక్సలైట్ రాళ్లు. ఇది చాలా సాధారణమైనది. ఇక రెండవది యూరిక్ యాసిడ్ రాళ్లు. ఇది మన శరీరంలోని యూరిక్ యాసిడ్ పెరుగుదలకు దారితీస్తుంది. ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది మూత్రంలో సిట్రేట్ స్థాయిని ఎంతగానో పెంచుతుంది. అలాగే ఇది కాల్షియం ఆక్సలైట్ తో పాటుగా మూత్రపిండంలో ఉన్న రాళ్లను కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు యూరిక్ యాసిడ్ ను నియంత్రించడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే మీ ఇంట్లో ఎవరికైనా కిడ్నీ సమస్యలు కనుక ఉంటే, అప్పుడు ప్రతి నిత్యం ఉదయం ఖాళీ కడుపుతో తాజా ఆరెంజ్ జ్యూస్ తాగండి. ఇలా మీరు నిత్యం కచ్చితంగా తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు రాకుండా నియంత్రించవచ్చు. అంతేకాక శరీరంలో ఉన్న వ్యర్ధాలు కూడా బయటకు పోతాయి

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది