Papaya Leaf : ఈ ఆకు తీసుకుంటే చాలు… కిడ్నీలు, కాలేయం,గుండె సమస్యలకు చెక్ పెట్టినట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Papaya Leaf : ఈ ఆకు తీసుకుంటే చాలు… కిడ్నీలు, కాలేయం,గుండె సమస్యలకు చెక్ పెట్టినట్లే…!

Papaya Leaf : మనం రోజు ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. ఆ పండ్లలో ఒకటి బొప్పాయి. అయితే ఈ బొప్పాయి రుచికరమైన,పోషకమైన పండు. మనకు ఆరోగ్య నిధి కూడా చెప్పవచ్చు. దీనిని తీసుకోవటం వలన మన జీర్ణక్రియను ఎంతో మెరుగుపరుస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలను తొలగించటంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. బొప్పాయిలో ఉండే పీచు మలబద్ధకం నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 May 2024,9:00 am

Papaya Leaf : మనం రోజు ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాం. ఆ పండ్లలో ఒకటి బొప్పాయి. అయితే ఈ బొప్పాయి రుచికరమైన,పోషకమైన పండు. మనకు ఆరోగ్య నిధి కూడా చెప్పవచ్చు. దీనిని తీసుకోవటం వలన మన జీర్ణక్రియను ఎంతో మెరుగుపరుస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలను తొలగించటంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. బొప్పాయిలో ఉండే పీచు మలబద్ధకం నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక బొప్పాయి తీసుకోవటం వల్ల మన శరీరానికి శక్తిని అందించి, ఇతర వ్యాధులను కూడా నివారించడంలో ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి రసంలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ కడుపు సమస్యలను నయం చేయగలదు. సాధారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాక బొప్పాయి గుండె,పేగు సమస్యలను కూడా దూరం చేయగలదు. బొప్పాయి మన శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాక వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా బొప్పాయి ఆకుల గురించి ఆలోచించారా. ఇది ఉపయోగమేనామరియు ఆశ్చర్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. బొప్పాయి ఆకు రసం వలన కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Papaya Leaf : బొప్పాయి ఆకుల వలన కలిగే ప్రయోజనాలు

1. డెంగ్యూ : డెంగ్యూ లాంటి వ్యాధుల చికిత్సకు బొప్పాయి ఆకుల రసం ఎంతో ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇది సర్వరోగ నివారిలాగా కూడా పనిచేయగలదు. రక్తంలో ప్లేట్ లేట్స్,RBC ల మొత్తాన్ని కూడా పెంచగలదు. ఇది రక్త ప్రసరణను ఎంతో మెరుగుపరుస్తుంది. బొప్పాయి ఆకుల్లో ఉన్నటువంటి యాంటీ ట్యూమర్ గుణాలు క్యాన్సర్ నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ లక్షణాలు కణితి పెరుగుదలను కూడా తగ్గించడంలో ఎంతో సహాయం చేస్తుంది. దీంతో క్యాన్సర్ పెరుగుదలను కూడా నియంత్రించవచ్చు. బొప్పాయి ఆకు రసం గర్భాశయ,రొమ్ము ప్రోస్టేట్ ఉపరితిత్తుల క్యాన్సర్ ను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి ఆకుల రసం కూడా మలబద్ధకం నుండి ఎంతో ఉపసమనం కలిగిస్తుంది. ఎందుకు అంటే. దీనిని బేధి మందు అని కూడా పిలుస్తారు. బేధిమందు మలబద్దక సమస్యల నుండి ఉపశమననం కలిగించగలదు. బొప్పాయి ఆకు రసం శరీరంలో రోగ నిరోధక శక్తిని పంచటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సికరణ ఒత్తిడి తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేయగలదు. కాలేయం, మూత్రపిండాలు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. దీనితోపాటు ఇది మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచటం లో కూడా ఎంతో మేలు చేస్తుంది.

Papaya Leaf ఈ ఆకు తీసుకుంటే చాలు కిడ్నీలు కాలేయంగుండె సమస్యలకు చెక్ పెట్టినట్లే

Papaya Leaf : ఈ ఆకు తీసుకుంటే చాలు… కిడ్నీలు, కాలేయం,గుండె సమస్యలకు చెక్ పెట్టినట్లే…!

Papaya Leaf పండిన బొప్పాయి తినటం వల్ల కలిగే ప్రయోజనాలు..

పీరియడ్స్ టైం లో స్త్రీలు బొప్పాయి తీసుకోవడం చాలా అవసరం. బొప్పాయి లో రుతు చక్రాన్ని సమానంగా మరియు ఆరోగ్యంగా ఉంచటంలో సహాయం చేస్తుంది. ఎక్కువగా ఇది రుతుస్రావ టైం లో కడుపు నొప్పిని తగ్గించడంలో కూడా ఎంతో సహాయం చేయగలదు..

కంటి చూపు : పండిన బొప్పాయిలో మంచి మొత్తంలో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేయగలదు. ఈ విటమిన్లు తీసుకోవడం వలన కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. అంతేకాక వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యల నుండి కూడా ఎంతో రక్షణ ఇస్తుంది. అందువలన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బొప్పాయి ప్రతిరోజు తప్పకుండా తీసుకోవడం చాలా అవసరం..

స్థూలకాయం : బొప్పాయి తినటం వల్ల స్థూలకాయాన్ని కూడా తగ్గించవచ్చు. పండిన బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. కావున ఇది బరువు తగ్గేందుకు కూడా సహాయం చేస్తుంది. పండిన బొప్పాయిని కేవలం 10 రోజులపాటు తీసుకోవటం వలన మీ శరీరంలోని వ్యత్యాసాలను కూడా మీరు గమనించవచ్చు..

గుండె జబ్బులు : బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు ఎ ,సి మరియు ఇ కూడా ఉన్నది. ఈ ఆక్సిడెంట్ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేయగలదు. ఇది గుండె సమస్యలను నివారిస్తుంది. ఇది కాకా రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రించే ఫైబర్ ఇందులో ఉన్నది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది