Health Tips : ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.. లేదంటే మీ ఎముకల సంగతి అంతే ఇక..
Health Tips : మన శరీరంలోని ముఖ్యమైన భాగంగా ఎముకలను పేర్కొంటుంటాం. శరీర నిర్మాణ వ్యవస్థ ఎముకలపైన ఆధారపడి ఉంటుంది. కాగా, వాటిని దృఢంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతని పెద్దలు చెప్తుంటారు కూడా. ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటేనే మనం ఏపనినైనా సక్రమంగా చేయొచ్చు. అలా ఉండాలంటే కనుక మీరు ఈ ఆహార పదార్థాలను తీసుకునే ముందర జాగ్రత్త వహించాలి. లేదంటే మీ ఎముకలు బాగా వీక్ అయిపోతాయి.ఎముకలు స్ట్రాంగ్ గా ఉండాలంటే విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను, పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. అది నిజమే. కానీ, దాంతో పాటు ఈ జాగ్రత్తలను కూడా తీసుకోవాలి. అతి ఎప్పుడైనా చేటు చేస్తుందన్న సంగతి అందరికీ విదితమే.
ఈ నేపథ్యంలోనే ఉప్పును అతిగా అస్సలు తీసుకోకూడదు. అలా ఉప్పును అతిగా తీసుకున్నట్లయితే మీ బాడీలో క్యాల్షియం తగ్గిపోయి మీకు బోలు ఎముకల వ్యాధి వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి సమతుల్య రీతిలో సాల్ట్‌ను తీసుకోవాలి.ఎక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకున్నా కూడా ఎముకలు దెబ్బతింటాయి. కాగా, వాటిని కూడా అవసరమైనంత మేరకే తీసుకోవాలి. ఇకపోతే చక్కెరను కొందరు అత్యంత ఇష్టంగా తీసుకుంటుండటం మనం చూడొచ్చు. అది నిజమే. మీరు చక్కెరను తీసుకోవచ్చు. కానీ, అలా ఎక్కువ చక్కెరను తీసుకోవడం వలన ఎముకలపైన ప్రతికూల ప్రభావాలు పడే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
Health Tips : ఇవి ఎముకలను దెబ్బతీస్తాయి..
పులుపు ఎక్కువగా తినడం వలన మీ ఎముకల బలహీనపడతాయి. కాబట్టి పులపు కూరగాయలు తీసుకునే ముందర జాగ్రత్త వహించాలి. మద్యం, సోడా, కూల్ డ్రింక్స్ ను కూడా లిమిట్ మించి తీసుకుంటే ఇబ్బందులే. ఎందుకంటే అవి.. ఎక్కువగా తీసుకోవడం వలన ఎముక ఖనిజ సాంద్రత తగ్గిపోయి పగుళ్ల ప్రమాదం వచ్చే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఆరోగ్యానికే ఇబ్బందులు వస్తాయి.