Health Tips : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను కాపాడే ఆ అయిదు పధార్థాలేంటో తెలుసా?
Health Tips : ఈ మధ్య కాలంలో చాలా మందికి ఒంట్లో చెడు కొవ్వు పెరిగిపోతోంది. అధిక బరువుతో బాధపడుతూ ఎన్న సమస్యల బారిన పడుతున్నారు. ఇవి చాలవన్నట్లు లావుగా ఉన్న చాలా మంది గుండె జబ్బులతో చనిపోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్ కు ముఖ్య కారణం గుండె నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. ఇలా గుండె నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు రక్త సరఫరాను అడ్డుకుంటుంది. దీని వల్ల గుండె పని తీరుకు ఆటంకం కల్గి గుండె సంబంధిత రోగాలు వస్తుంటాయి. కొన్ని సార్గు సడెన్ గా గుండె ఆగిపోతుంటుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు మన ఇంట్లో ఉండే ఈ ఐదు పదార్థాలు చాలా ఉపయోగపడతాయట. ఈ మధ్య కాలంలో చేసిన పలు పరిశోధనల్లో ఈ విషయం తేలిందట. అయితే ఆ అయిదు పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి, మిరియాలు, పసుపు, పుదీనా, దాల్చిన చెక్కలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండెలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయట. రెండు గ్రాముల మిరియాలు, రెండు గ్రాముల దాల్చన చెక్క పొడి, చిటికెడు పసుపు, గుప్పెడు పుదీనా ఆకులు, రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి కాస్తంత తేనె కలుపుకొని తాగాలి. అయితే చక్కెర వ్యాధి ఉన్న వారు తేనె కలపకుండానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందట. రక్త నాళాల లైనింగ్ పని తీరును మెరుగుపరచడం ద్వారా పసుపు గుండె జబ్బు ప్రక్రియలో దశలను తిప్పికొడుతుందట. అందు వల్ల ఇది మీ రక్తపోటు.
రక్తం గడ్డ కట్టడం, గుండె ఆరోగ్యానికి కీలకమైన ఇతర కారకాలను నియంత్రించడం సహాయ పడుతుంది.అయితే ఇందులో ఉండే మిరియాల వల్ల బీటా కెరోటిన్ శోషణను మెరుగుపరుస్తాయట. బీటా కెరోటిన్ సెల్యూసార్ డ్యామేజ్ తో పోరాడే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. తద్వారా గుండె, కంటి జబ్బులను నివారిస్తుంది. పుదీనా అవయవ కణజాలానికి హానీ కల్గించే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడం సాయ పడుతుందట. దాని వల్ల మీ కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. గుండ డబ్బులతో పాటు మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే వెల్లుల్లి రసం ధమనులలో మృదువుగా ఉండే ఫలకం మెత్తాన్ని తగ్గించడంలో సాయ పడుతుందని కూడా కొన్ని పరిశోధనలు తెలిపాయి. మృధువైన ఫలకం విరిగిపోయే అవకాశం ఉంటే గుండెపోటుకు దారి తీసే అడ్డంకిని కల్గిస్తుంది.