Rain Season : వానా కాలం… వ్యాధుల కాలం…ఈ పొడితో చెక్ పెట్టండి ఇలా…!
Rain Season : వానా కాలం స్టార్ట్ అయింది. ఈ సీజన్లో రకరకాల ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దీనిలో జలుబు, దగ్గు, జ్వరం కూడా ఒకటి. ఒకసారి ఇంట్లో ఎవరికైనా దగ్గు వచ్చింది అంటే చాలు, అది అంత తొందరగా పోనే పోదు. దీనితో పాటుగా ఊపిరితిత్తులలో కఫం కూడా ఏర్పడుతుంది. అలాగే ఇంటిల్లి పాదిని వెంటాడుతూ ఉంటుంది. మీరు దీర్ఘకాలిక దగ్గును తగ్గించుకోవడానికి ఎంతో సమర్థవంతమైన ఇంటి నివారణ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇక్కడ కొన్ని బెస్ట్ హోమ్ రెమెడీస్ గురించి తెలిపారు. అవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
వానా కాలంలో వేదిచేటటువంటి సీజనల్ సమస్యలకు తేనె ఒక అద్భుతమైన హోమ్ రెమిడిగా పని చేస్తుంది. తేనెలో యాంటీ ఇన్ ప్లామెంటరీ, యాంటీ మైక్రోబియన్ గుణాలు కఫం నుండి ఉపశమనం కలిగించేందుకు ఉపయోగపడతాయి. బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షలను నియంత్రించడంలో కూడా ఈ తేనే అనేది ఎంతో ప్రభావితంగా పని చేస్తుంది. దీనిలో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకొని తాగినట్లయితే జలుబు, దగ్గు లాంటి సమస్యలతో పాటు జ్వరం, తలనొప్పి ని కూడా నయం చేస్తుంది. ఉదయం మరియు సాయంత్రం ఒక చెంచా తేనె ను తీసుకోవడం కూడా ఒక ప్రయోజనకరంగా ఉంటుంది.
అలాగే అల్లం తీసుకోవటం వలన కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. పచ్చి అల్లం తీసుకోవటం లేక దాని రసం చేసుకొని తాగటం వలన కూడా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. అంతేకాక మిరియాల పొడిని ఒక చెంచా తేనెలో కలుపుకొని తీసుకున్నట్లయితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యల నుండి కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కానీ దీనిని అధికంగా తీసుకున్నట్లయితే శరీరంలో ఉష్ణోగ్రత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కావున చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది…