Heart Diseases : మీకు తెలియని అరుదైన గుండెకి గుండెపోటు సమస్యలు ఉన్నాయి.. మీకు తెలుసా..?
మనిషి శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. మన శరీరానికి రక్తం సరఫరా చేయడంలో, రక్తం ద్వారా ఆక్సిజన్ శరీరం అంతట అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది గుండె. అలాంటి గుండెను జాగ్రత్తగా కాపాడుకోకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. వీటి గురించి ప్రాథమిక ఆలోచన ఉండడం చాలా అవసరం. ఆ సమస్యలను గుర్తించి త్వరగా చికిత్స తీసుకోవడానికి సహాయపడుతుంది. అయితే గుండెకి గుండెపోటు సమస్య మాత్రమే వస్తుంది అనుకుంటా కానీ మనకి తెలియని ఎన్నో జబ్బులు గుండెకి వస్తాయి.
1) కవాసకి : ఇది గుండెకి వచ్చే అరుదైన సమస్యలలో ఒకటి. కరోనరీ ధమనుల వాపు కారణంగా ఈ సమస్య వస్తుంది. ఇది ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారికి తీవ్రమైన జ్వరం చేతులు వాయడం కళ్ళు ఎర్రబడడం చర్మం పొట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యలో శోషరస కణుపులు ఉబ్బుతాయి. దీనిని మ్యూకోక్యుటేనియస్ లింఫ్ నోడ్ సిండ్రోమ్ అని కూడా అంటారు.
2) టాకోట్సుబో కార్డియోమయోపతి : తీవ్ర భావోద్వేగానికి గురైతే ఈ సమస్య సంభవిస్తుంది. అధిక శారీరక శ్రమ వలన కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య గుండె పంపి చాంబర్ ను ఖాళీ చేస్తుంది. రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీంతో గుండెకి ఈ సమస్య వస్తుంది.
3) కార్డియాక్ సిండ్రోమ్ X : ఇది కూడా ఒక అరుదైన గుండె సమస్య. కార్డియాక్ సిండ్రోమ్ vs యాంజియోగ్రామ్‌లలో కరోనరీ వాస్కులర్ అసాధారణతలను చూపదు. ఇది యాంజినల్ నొప్పి ద్వారా వర్గీకరిస్తారు. ఇది పెరిమెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఇది ఎక్కువగా వస్తుంటుంది.
4) ట్రాన్స్ థైరెటిన్ అమిలాయిడ్ కార్డియో మయోపతి : ఇది అరుదైన గుండె సమస్య. దీనిలో క్రమరహిత ప్రొటీన్లు గుండెలో పేరుకుపోతాయి. ఈ ప్రోటీన్ గుండె ఎడమ వైపు ఉన్న వెంట్రికల్స్‌ను గట్టిపరుస్తుంది, దాని కారణంగా వాటి పంపింగ్ సామర్థ్యం తగ్గుతుంది. వెంట్రికల్స్ గుండెలో ముఖ్యమైన భాగం. ఈ ప్రొటీన్లు గుండెకు రక్తాన్ని పంప్ చేయడం కష్టతరం చేస్తాయి. దీనిని కార్డియాక్ అమిలోయిడోసిస్, అమిలోయిడోసిస్ ATTR అని కూడా అంటారు.
5) ST ఎలివేషన్ మయో కార్డియాల్ ఇన్ ఫర్క్షన్ : ఇది మరొక రకమైన గుండె సమస్య. ఇది చాలా అరుదుగా కనిపించే సమస్య. ST-ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ కేసులు మహిళల్లో మాత్రమే కనిపిస్తాయి. STEMIలో, మేజ్ కరోనరీ ఆర్టరీ పూర్తిగా బ్లాక్ అవుతుంది. దిన్ని గుండెపోటుకు సంబంధించిన అత్యంత సాధారణమైన రకాలలో ఒకటిగా కూడా చెబుతారు.తాజా అధ్యయనం ప్రకారం.. సోమవారం రోజు.. STEMI ప్రమాదం ఎక్కువగా పెరుగుతుందని గుర్తించారు.