Husband Wife : విడాకుల కోసం కోర్ట్ కు వచ్చిన భార్య ను ఒక్క పాటతో మనసు మార్చేసిన భర్త.. వీడియో వైరల్ !
ప్రధానాంశాలు:
విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భార్య కు ఒక్క పాటతో మనసు మార్చిన భర్త
Husband Wife : విడాకుల కోసం కోర్ట్ కు వచ్చిన భార్య ను ఒక్క పాటతో మనసు మార్చేసిన భర్త.. వీడియో వైరల్ !
Husband Wife : ఈ రోజుల్లో విడాకులు సాధారణ విషయంగా మారిపోయినప్పటికీ, కొన్ని సంఘటనలు మనసును తాకేలా ఉంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఓ జంట చిన్న మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అయితే కోర్టు వద్ద భార్యను చూసిన భర్త ఒక్కసారిగా ఆమె ముందే ఓ ప్రేమగీతం ఆలపించాడు. అంతటితో ఆగకుండా తన ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు.

Husband Wife : విడాకుల కోసం కోర్ట్ కు వచ్చిన భార్య ను ఒక్క పాటతో మనసు మార్చేసిన భర్త.. వీడియో వైరల్ !
Husband Wife : ఆ ఒక్క పాటతో భార్య మనసు కదిలించినా భర్త… దెబ్బకు విడాకులు వద్దు భర్తే ముద్దు అనేసింది
భర్త పాడిన పాటతో భార్య భావోద్వేగానికి లోనయ్యింది. ఆమె మనసును కదలడం తో గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయింది. కొద్ది సేపట్లోనే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది. “విడాకులు వద్దు… నా భర్తతోనే జీవితం కొనసాగించాలనుకుంటున్నాను” అని కోర్టు ఎదుట ప్రకటించింది. ఈ అనూహ్య పరిణామం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. కోర్టు హాలులో ఒక్కసారిగా హర్షధ్వానాలు వినిపించాయి.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు నెటిజన్లు “ప్రేమ నిజమైనదైతే ఎలా అయినా తిరిగి కలుస్తుంది” అంటూ స్పందిస్తుంటే, మరికొందరు “ఒక పాట ఎంతటి మాయ చేయగలదో ఇదే నిదర్శనం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. విడాకుల కోర్టులో ప్రేమకు తిరిగి జన్మనిచ్చిన ఈ జంట కథ, ఇప్పుడు అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.
విడాకులు కోసం కోర్టుకు వెళ్లిన భార్య మీద కోర్టులోనే పాట పాడిన భర్త.
తిరిగి ప్రేమలో పడ్డ భార్య.
తెలివైన వాడు మన వాడు! #Divorce #UANow pic.twitter.com/V9bpyfFf2v
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) July 15, 2025