Rice Water : బియ్యం కడిగిన నీళ్లు జుట్టు ఆరోగ్యాన్ని పెచ్చుతాయంటే నమ్ముతార… అవునండి ఇది నిజం…!!
ప్రధానాంశాలు:
Rice Water : బియ్యం కడిగిన నీళ్లు జుట్టు ఆరోగ్యాన్ని పెచ్చుతాయంటే నమ్ముతార... అవునండి ఇది నిజం...!!
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. దీనికోసం ఇంట్లో దొరికే సహజ పదార్థాలను అధికంగా వాడుతూ ఉంటారు. అలాగే వెంట్రుకల అందాన్ని పెంచడంలో బియ్యం కడిగిన నీళ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే బియ్యం కడిగిన నీళ్లలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. దీనిలో ఉన్న ఇనోసిటోల్ అనే ఒక కార్బోహైడ్రేట్ వలన జుట్టు అనేది ఎంతో ఒత్తుగా పెరుగుతుంది. సాధారణంగా ఈ కార్బోహైడ్రేట్ అనేది బియ్యం కడిగిన నీళ్లలో అధికంగా ఉంటుంది. జుట్టును బియ్యం కడిగిన నీళ్లతో వాష్ చేసుకోవడం వలన జుట్టు అనేది ఎంతో ఒత్తుగా పెరుగుతుంది. అలాగే నల్లగా మెరుస్తూ ఎంతో మృదువుగా కూడా మారుతుంది. అంతేకాక ఈ బియ్యం కడిగిన నీళ్లు మీ జుట్టు యొక్క మూలాలో విటమిన్ లోపాన్ని కూడా పూరిస్తుంది. అలాగే బియ్యం కడిగిన నీళ్ళ తో తల స్నానం చేయడం వలన చుండ్రు అనేది తొందరగా పోతుంది. అలాగే తలపై ఉన్నటువంటి చిన్న చిన్న పొక్కులు కూడా తొందరగా తగ్గిపోతాయి. జుట్టు అనేది ఎంతో నిగనిగలాడుతుంది…
బియ్యం కడిగిన నీళ్లు జుట్టు పెరుగుదలలో పరోక్ష పాత్ర పోషిస్తుంది అని నిపుణులు అంటున్నారు. ఇది జుట్టుకు ఎంత మెరుపుని ఇస్తుంది. కావున మీరు మీ హెయిర్ కేర్ రొట్టిన్ లో బియ్యం కడిగిన నీటిని వాడండి. అలాగే మీరు కావాలంటే రైస్ వాటర్ హెయిర్ స్ప్రేని కూడా వాడవచ్చు. ఎందుకంటే ఇది మీ జుట్టు మీద రక్షణ పొరను ఏర్పరుస్తుంది. కావున ఎలాంటి హానికరమైన పదార్థాలు మీ జుట్టుపై దాడి చేయవు. అలాగే వీటిని హెయిర్ మాస్క్ గా కూడా వాడవచ్చు. ఇందుకోసం ఒక బౌల్ లో అవిసె గింజల పొడి మరియు బియ్యం పిండిని కలపాలి. దీనిలో కొన్ని బియ్యం కడిగిన నీళ్ళను పోసి బాగా కలుపుకోవాలి. వీటితో చిక్కటి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. దీనివలన మీరు ఎన్నో మంచి ఫలితాలను పొందుతారు…
జుట్టును వాచ్ చేసేందుకు బియ్య కడిగిన నీళ్ళు వాడటం వలన కూడాఎంతో ప్రభావం ఉంటుంది. జుట్టు యొక్క అందాన్ని పెంచుకునేందుకు ఒక్క బియ్య నీళ్ళే 100 సార్లు పనిచేస్తాయి. కావున బియ్యం కడిగిన నీళ్లను జుట్టు యొక్క మూలాల్లోకి పట్టించి స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి. ఇది మీ జుట్టును అందంగా మరియు మెరిసేలా కూడా చేస్తుంది. కానీ ఇక్కడ కూడా కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి. మీ జుట్టుకు ఎటువంటి సమస్యలు ఉన్న, వాటికి చికిత్స గనక తీసుకుంటే, ఇలాంటివి పాటించే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి అని అంటున్నారు నిపుణులు