Tea : ఈ టీ తాగితే బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : ఈ టీ తాగితే బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 May 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : ఈ టీ తాగితే బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం..!

Tea : చాలా మందికి కొన్ని విషయాలు తెలియవు. ఉదయం లేవగానే చాయ్ తాగేస్తుంటారు. అంతే కాకుండా కాఫీలు, ఇతర కొన్ని టీలు కూడా తాగుతుంటారు. అయితే టీ, కాఫీలు ఆరోగ్యానికి అంత మంచివి కావని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కానీ టీలలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ తాగితే మాత్రం కచ్చితంగా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవాలి. అదే కొంబుచా టీ. దీన్ని తాగితే మాత్రం మీకు దివ్య ఔషధం దొరికినట్టే అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీన్ని చక్కెర, టీ డికాషన్, ఈస్ట్, బ్యాక్టీరియా ఎంజైమ్స్‌తో తయారు చేసి పులియబెడుతారు.

Tea : కేలరీలు తక్కువ..

కాబట్టి ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ప్రోబయోటిక్ లక్షణాల అధికంగా ఉంటాయి. అంతే కాకుండా పులియబెట్టినప్పుడు ఇది సహజ ఆమ్లాలు, ఎంజైమ్స్‌ని విడుదల చేస్తుంది. కాబట్టి ఇది పేగుల ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెబుతున్నారు. అంతే కాకుండా ఇది బరువు తగ్గించేందుకు కూడా సాయం చేస్తుంది.ఎందుకంటే ఇందులో 40 కేలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించేందుకు సాయం చేస్తుంది. దాంతో పాటు ఇందులో ఉండే ప్రో బయోటిక్ లక్షణాలు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి.

Tea ఈ టీ తాగితే బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం

Tea : ఈ టీ తాగితే బరువు తగ్గడంతో పాటు బెల్లీ ఫ్యాట్ దూరం..!

ప్రేగుల్లో సూక్ష్మజీవుల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయడంలో ఈ టీ బాగా పని చేస్తుంది. దీన్ని బ్లాక్ టీతో తయారు చేస్తారు. కాబట్టి దీని వల్ల బ్యాక్టీరియా ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా కాబట్టి ఇందులో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాడీకి హాని చేసే చెడు బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలని తగ్గిస్తాయి. ఇమ్యూనిటీని బలంగా చేసే యాంటీ మైక్రోబయల్స్‌ని ఉత్పత్తి చేస్తుంది ఈ టీ. ఇక మరో అతిపెద్ద ఉపయోగం ఏంటంటే దీన్ని తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. సోడాలు, జ్యూస్ లలో కంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.

కాబట్టి ఈజీగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో కొంబుచా టీ హెల్ప్ చేస్తుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి దీన్ని తాగేందుకు ఇంట్రెస్ట్ చూపించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది