Sesame With Jaggery : సంక్రాంతి వచ్చింది.. బెల్లం తో పాటు, వీటిని కూడా కలిపి లడ్డులు చేస్తే మీ ఆరోగ్యం రెట్టింపు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sesame With Jaggery : సంక్రాంతి వచ్చింది.. బెల్లం తో పాటు, వీటిని కూడా కలిపి లడ్డులు చేస్తే మీ ఆరోగ్యం రెట్టింపు..?

 Authored By ramu | The Telugu News | Updated on :11 January 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Sesame With Jaggery : సంక్రాంతి వచ్చింది.. బెల్లం తో పాటు, వీటిని కూడా కలిపి లడ్డులు చేస్తే మీ ఆరోగ్యం రెట్టింపు..?

Sesame With Jaggery : శీతాకాలం వచ్చిందంటే శరీరం వేడిని కోరుకుంటుంది. ఇటువంటి సమయంలో కొన్ని ఆహార పదార్థాలను తింటే ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రతి సంక్రాంతి పండుగ వస్తుంది అనగానే రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. అందులో బెల్లం, నువ్వులతో చేసిన లడ్డూలు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే శరీరం వేడిని ఇస్తుంది. జలుబు, దగ్గు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో నువ్వులు బెల్లం,తినడం వల్ల చర్మానికి జుట్టుకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటి వల్ల జుట్టులో నిగారింపు కనబడుతుంది. ఏ వృద్ధాప్య ఛాయలు కూడా దరి చేరవు. అంటువ్యాధులకు బారిన పడుతుంటారు. మాటిమాటికి జలుబు, దగ్గు,గొంతు నొప్పి, ఇందులో గరగర వంటివి వెలువడుతుంటాయి.

Sesame With Jaggery సంక్రాంతి వచ్చింది బెల్లం తో పాటు వీటిని కూడా కలిపి లడ్డులు చేస్తే మీ ఆరోగ్యం రెట్టింపు

Sesame With Jaggery : సంక్రాంతి వచ్చింది.. బెల్లం తో పాటు, వీటిని కూడా కలిపి లడ్డులు చేస్తే మీ ఆరోగ్యం రెట్టింపు..?

అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే… శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ చలి నుండి రక్షణ కలిగించుకొనుటకు మందపాటి దుస్తులు వేసుకుంటే సరిపోదు. శరీరం అంతర్గత భాగం నుంచి కూడా వేడిని అందించాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం నువ్వులు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నువ్వులు శరీరం యొక్క అంతర్గత భాగం నుంచి వేడిని పుట్టిస్తుంది. కాబట్టి మీరు ఆహారంలో తెల్ల నువ్వులు చలికాలంలో కచ్చితంగా చేర్చుకోవాలి. నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం లోపలి భాగం నుంచి వెచ్చగా ఉంటుంది. బెల్లంలో అధికంగా క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లు ఉంటాయి. అదే సమయంలో నువ్వులు ఆరోగ్యానికి మేలు చేసే క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ తో పాటు ప్రోటీన్, ఫైబర్ లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అయితే చలికాలంలో బెల్లంతో కలిపిన నువ్వులను మిశ్రమం జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది తగినంత మొత్తంలో ఫైబర్ ని అందిస్తుంది. దాని వల్ల నా దీన వ్యవస్థలోని సమస్యలను తొలగిపోతాయి. రెండిటిలోనూ ఐరన్ తగినంత పరిమాణం లభిస్తుంది.

నువ్వులు,బెల్లం తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. నువ్వులలో మెగ్నీషియం తగినంత పరిమాణంలో ఉంటుంది. దీనిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుటలో సహాయపడుతుంది. ఈ రెండిటిలోనూ ఐరన్ తగినంత పరిమాణం లభిస్తుంది. చలికాలంలో నువ్వులు బెల్లంతో చేసిన లడ్డు తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది శరీరంలో వేడిని నిర్వహిస్తుంది. జలుబు దగ్గు నుండి ఉపశమనం అందిస్తుంది. చలికాలంలో నువ్వులు బెల్లం తినడం వల్ల చర్మం,జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టులోని నిగారింపును కాపాడుతుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు కూడా రాకుండా చేస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది