Jackfruit : ఈ వ్యాధులు ఉన్నవారు పనస పండును తినకూడదు… తిన్నారంటే ఇక అంతే…?
ప్రధానాంశాలు:
Jackfruit : ఈ వ్యాధులు ఉన్నవారు పనస పండును తినకూడదు... తిన్నారంటే ఇక అంతే...?
Jackfruit : వేసవి కాలం వచ్చింది అంటే కొన్ని రకాల పండ్లు మనకు కనువిందు చేస్తాయి. ఇలాంటి పండులో ఒకటైనది పనస పండు. పండుని ఇంగ్లీషులో జాక్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీన్ని పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. పనస పండులో అనేకరకాల పోషకాలు ఉంటాయి. కానీ, పనస పండును కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అస్సలు తినకూడదు. మరి, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పనసపండు తినకూడదో.. ఒకవేళ తింటే ఎటువంటి సమస్యలు రావొచ్చో తెలుసుకుందాం. పనస పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ఆంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి పోషకాలను అందిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొందరికి మాత్రం పనసపండు నచ్చదు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పనసపండును అస్సలు తినకూడదు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Jackfruit : ఈ వ్యాధులు ఉన్నవారు పనస పండును తినకూడదు… తిన్నారంటే ఇక అంతే…?
Jackfruit ఎలర్జీ సమస్యలు
ఎలర్జీ సమస్యలు ఉన్నవారు ఈ పనసపండు తింటే వెంటనే చర్మం మీద దద్దుర్లు, గజ్జి, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ సమస్యలు ఉన్న వారిని ఈ పనసపండు ఎక్కువ ప్రభావితం చేస్తుంది. కాబట్టి, అలర్జీ సమస్యలు ఉన్నవారు దీనిని తినపోవడమే మంచిది.
కిడ్నీ సమస్యలు : పనస పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఈ సమస్యలు ఉన్నవారు ఈ పనసపండుని తినకూడదు. పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీల పనితీరును దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. కనుక, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పనస పండును తినకూడదు.
మధుమేహం: షుగర్ పేషెంట్లు పనసపండును ఎక్కువగా తినకూడదు. డయాబెటిస్ సహజమైన చక్కర అధికంగా ఉండడంతో రక్తంలో చక్కర స్థాయిలో పెరిగే ప్రమాదం ఉంది. లెవెల్ సదుపులోకి లేకపోతే ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది. కావునా ఈ పనస పండు ని డయాబెటిస్ వారు తినకూడదు.
శస్త్ర చికిత్స చేసుకున్నవారు: శస్త్ర చికిత్సలు చేసుకున్న వారు పనసపండుకు దూరంగా ఉండాలి. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. కడుపు సమస్యలు, గ్యాస్, కడుపుబ్బరం అంటే ఇబ్బందులను తెస్తుంది. వైద్యుల సలహా మేరకు తీసుకుంటే మంచిది.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులు : గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పనసపండును ఎక్కువగా తినకూడదు. కొందరికీ జీర్ణ సమస్యలను తలెత్తే ఎలా చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యతను కలిగించవచ్చు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పండును తినాలి అనుకుంటే, పని సరిగా డాక్టర్ సలహా తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ పనస పండు ఎంతో రుచికరమైనది. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కానీ, కొంతమందికి ఇది హానికరం కావచ్చు. పై చెప్పినా ఆరోగ్య సమస్యలన్నిటికీ పనస పండు తినే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి తినాల్సి ఉంటుంది.