Green Tea : ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ అస్సలు తాగకూడదట… ఒకవేళ తాగారో… అంతే సంగతి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Tea : ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ అస్సలు తాగకూడదట… ఒకవేళ తాగారో… అంతే సంగతి…!!

 Authored By ramu | The Telugu News | Updated on :19 September 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Green Tea : ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ అస్సలు తాగకూడదట... ఒకవేళ తాగారో... అంతే సంగతి...!!

Green Tea : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. అందుకే బరువు తగ్గడానికి మరియు ఫిట్ గా ఉండడానికి ఎక్కువగా గ్రీన్ టీ తాగుతున్నారు. అయితే సాధారణ టీ తో పోలిస్తే, గ్రీన్ టీ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే దీనిని తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నిజం చెప్పాలంటే, గ్రీన్ టీ అనేది మన శరీరానికి లెక్కలేని ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం ఈ గ్రీన్ టీ ఎంతో హానికరం. గ్రీన్ టీ ని అధికంగా తాగటం కూడా ఆరోగ్యానికి హానికరమే. ముఖ్యంగా చెప్పాలంటే,కొన్ని సమస్యలతో బాధపడే వారు గ్రీన్ టీ అస్సలు తాగకూడదు అని వైద్య నిపుణులు అంటున్నారు…

Green Tea గ్రీన్ టీ ప్రయోజనాలు

గ్రీన్ టీ బరువు తగ్గటానికి అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో ఫాలీఫైనల్స్ మరియు క్యాటేచిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మధుమేహాన్ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే ఇది పొట్ట మరియు నడుము కొవ్వును ఈజీగా తగ్గిస్తుంది…

ఈ వ్యాధి ఉన్నవారు గ్రీన్ టీ తాగకూడదు : కొంతమంది గ్రీన్ టీ ని అధికంగా తీసుకుంటే కాలేయ సమస్యలు వస్తాయి. ఈ గ్రీన్ టీ లో ఉండే క్యాటెచిన్స్ అనేది ప్రధానంగా EGCG (ఎపిగల్లోకాటెచిన్ గాలెట్) కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ఎంతో ప్రమాదకరం అని అంటున్నారు నిపుణులు.

Green Tea ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ అస్సలు తాగకూడదట ఒకవేళ తాగారో అంతే సంగతి

Green Tea : ఈ సమస్యలు ఉన్నవారు గ్రీన్ టీ అస్సలు తాగకూడదట… ఒకవేళ తాగారో… అంతే సంగతి…!!

రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలి : మీరు రోజుకు రెండు కప్పులు గ్రీన్ టీ తాగితే సరిపోతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. ఇంతకంటే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే శరీరంలో ఎలాంటి సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించిన తర్వాత గ్రీన్ టీ ని తాగాలి. లేకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మీరు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చాలు పెద్ద వ్యాధులను సైతం తగ్గించవచ్చు అనే విషయాలను మాత్రం మీరు కచ్చితంగా గుర్తుంచుకోవాలి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది