Sleeping : స్నానం చేసే నీటిలో ఈ నూనె కలిపితే నిద్రలేమీ సమస్యకు చెక్ పెట్టవచ్చు…!
ప్రధానాంశాలు:
Sleeping : స్నానం చేసే నీటిలో ఈ నూనె కలిపితే నిద్రలేమీ సమస్యకు చెక్ పెట్టవచ్చు...!
Sleeping : ప్రస్తుతం చాలామందిని వేధించే సమస్య నిద్రలేమి. ఈ సమస్యతో కొంతమంది సతమతమవుతూ ఉంటారు.. రోజంతా పనిచేసే అలసిపోయి ఉన్న కానీ సరియైన నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు.. ఇలాంటి సమస్యకి కొన్ని చిట్కాల ద్వారా చెక్ పెట్టవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఎవరైతే పడుకోగానే నిద్రపోతారో..వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తూ ఉంటారు.. ఎందుకంటే ప్రస్తుతం జీవనశైలి విధానములో ఎన్నో మార్పుల వలన చాలామంది మానసిక ఒత్తిడి ఆలోచనలు ఎన్నో సమస్యలు తో సతమతమవుతూ ఉండటం వల్ల సరియైన నిద్రను ఆస్వాదించలేకపోతున్నారు.. అయితే కొన్ని టిప్స్ తో ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం…
లావెండర్ ఆయిల్: రాత్రి సమయంలో స్నానం చేసే నీటిలో ఈ ఆయిల్ కలిపి చేస్తే పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు.. మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది ఈ ఆయిల్..
అలాగే హాయిగా నిద్ర పోవడానికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి..అలాగే ధ్యానం చేయడం, కంప్యూటర్స్, మొబైల్స్ కు దూరంగా ఉండడం చాలా మంచిది. రాత్రి సమయంలో తిన్న తర్వాత కొద్ది దూరం నడవడం వలన ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. దాంతోపాటు మంచి నిద్ర పడుతుంది..
పసుపు పాలు: రాత్రి సమయంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పాలల్లో పసుపు కలుపుకొని తాగడం వలన ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఓ గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తీసుకోవాలి. పాలలోని సెరోటిన్ మానసిక ఒత్తిడి తగ్గించి మంచి నిద్రకూ సహాయపడుతుంది…
ఆయిల్ మసాజ్: రాత్రి సమయంలో పడుకునే ముందు మీ పాదాలను నీటితో శుభ్రం చేసుకుని తర్వాత టవల్తో తుడిచి ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వలన మంచి నిద్రను ఆస్వాదిస్తారు..ఈ విధంగా మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి మీ శరీరానికి ప్రశాంతతను కలిగిస్తుంది…
అశ్వగంధ పొడి: రాత్రి పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలలో అశ్వగంధ పొడి కలిపి తీసుకోవాలి. ఇది మానసిక ఒత్తిడి తగ్గించే గుణాలు అశ్వగంధలో అధికంగా ఉంటాయి. దీనిని ఎలా తీసుకున్న కానీ నిద్ర సమస్యలకు చెక్ పెట్టవచ్చు..