Left Side Sleep : పడుకునే సమయంలో ఎడమవైపు మాత్రమే నిద్రిస్తే…. ఏం జరుగుతుందో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Left Side Sleep : పడుకునే సమయంలో ఎడమవైపు మాత్రమే నిద్రిస్తే…. ఏం జరుగుతుందో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 December 2024,1:00 pm

Left Side Sleep : కొందరు ఎక్కువ పడుకునే సమయంలో ఒక రకమైన భంగిమలో నిద్రిస్తుంటారు. కానీ నిజానికి నిద్రించే సమయంలో ఏ వైపు ఎక్కువగా పడుకుంటే ఆరోగ్యానికి మంచిది. అనే విషయంపై పరిశోధకులు పరిశోధన చేశారు. అయితే ఎక్కువగా ఎడమవైపు తిరిగి పడుకుంటే, అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది , దీనివల్ల మన ఆరోగ్యం పై గననీయమైన ప్రభావం కూడా ఉంటుంది.

Left Side Sleep ఎందుకు ఎడమ వైపు మాత్రమే తిరిగి పడుకోవాలి

నిద్రించే సమయంలో కేవలం ఎడమవైపు మాత్రమే తిరిగి పడుకోవాలి… అంటే, మన శరీరంలో అనేక అవయవాలు ఎడమవైపు ఉంటాయి. ముఖ్యంగా గుండె ఎడమవైపున ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన రక్త ప్రసన్న చాలా సులభంగా అవుతుంది. సులభంగా అవ్వడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. తద్వారా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. గుండెకు రక్తం సరఫరా సరిగ్గా అవ్వాలి. అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Left Side Sleep పడుకునే సమయంలో ఎడమవైపు మాత్రమే నిద్రిస్తే ఏం జరుగుతుందో తెలుసా

Left Side Sleep : పడుకునే సమయంలో ఎడమవైపు మాత్రమే నిద్రిస్తే…. ఏం జరుగుతుందో తెలుసా…?

Left Side Sleep ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఎడమవైపు ఎక్కువగా తిరిగి పడుకోవడం వల్ల రక్తప్రసన్న గుండెకు సరఫరా సరిగ్గా అవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా ఎడమవైపున ఉంటుంది కాబట్టి, మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. అలాగే లింఫాటిక్ వ్యవస్థ శరీరంలోని వ్యర్ధాలను తొలగించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల లింఫాటిక్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా డాక్టర్స్ ఎక్కువగా ఎడం వైపు తిరిగి పడుకోండి అని చెబుతూ ఉంటారు. కారణం గర్భాశయంలో ఉన్న శిశువుకు రక్తప్రసరణ సరిగ్గా అవుతుంది. వారా శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎడమ వైపు తిరిగి పడుకుంటే వెన్ను నొప్పి కూడా తగ్గిపోతుంది. అలాగే ఎడమవైపు పండుకోవటం వల్ల మెదడుకు కూడా రక్త ప్రసరణ సులభం అవుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మనకి గ్యాస్ ఫామ్ అయినప్పుడు, బయటికి రిలీజ్ అవ్వాలంటే వైపుకి తిరిగి పడుకుంటే కడుపుబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

ముఖ్యమైన విషయాలు : కానీ ప్రతి ఒక్కరికి శరీరము ఒకటి కాదు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, సలహా తీసుకోవడం మంచిది. గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నవారు, వైద్యులు సంప్రదించి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు ఎడమ వైపు తిరిగి పడుకుంటే గుండెకు గ్యాస్ పట్టేసే అవకాశం ఉంది. గ్యాస్ పట్టిన సమయంలో అలా ఎడమ వైపు తిరిగి పడుకోవద్దు. అలా పడుకుంటే గుండెకు నొప్పిని కలిగిస్తుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేక ఉన్నప్పటికీ, ఇది ఒక సమగ్రమైన ఆరోగ్య పద్ధతి కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయటం, తగినంత నిద్రపోవడం వంటివి చాలా ముఖ్యం.

ముగింపు : గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఎక్కువగా ఎడమవైపు తిరిగి పడుకుంటే మంచిది. గ్యాస్ ప్రాబ్లమ్స్, గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నవారు. ఇతర వ్యాధులు కూడా ఉన్నవారు. కొద్దిగా జాగ్రత్త పాటించాలి. మెల్లగా ఒకవైపుకి తిరగాలి. అకస్మాత్తు గా లేవదు. పడుకున్నప్పుడు ఒక సైడ్ కి నెమ్మదిగా లేవాలి. ఇలా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎడమవైపు పడుకోవడం వల్ల ఆరోగ్యం పై గణనీయమైన ప్రభావం ఉంది. కాబట్టి సరళమైన అలవాటు నువ్వు అలవర్చుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది