Tea : మీరు రోజు తాగే టీ లను పక్కనపెట్టి ఈ టీ లను మొదలు పెట్టండి.. అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea : మీరు రోజు తాగే టీ లను పక్కనపెట్టి ఈ టీ లను మొదలు పెట్టండి.. అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం…!

Tea : మీకు ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం అలవాటు ఉందా ఉదయాన్నే టీ తాగడం అనేది చాలామందికి ఒక ఆచారం లాంటిది. ఎందుకంటే చాలామంది తమ రోజును ఒక కప్పు వేడి వేడి టీ తో ప్రారంభించడానికి ఇష్టపడతారు.. వారు ఉదయం ఒక కప్పు టీ తాగకుండా ఎటువంటి కార్యకలాపాలు మొదలపెట్టలేరు. ఒకరకంగా చెప్పాలంటే టీలో యాంటీ ఆక్సిడెంట్లు లేదా కాటేజిన్స్ వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి టీ తాగే వారిలో రోగ […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 October 2023,7:00 am

Tea : మీకు ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం అలవాటు ఉందా ఉదయాన్నే టీ తాగడం అనేది చాలామందికి ఒక ఆచారం లాంటిది. ఎందుకంటే చాలామంది తమ రోజును ఒక కప్పు వేడి వేడి టీ తో ప్రారంభించడానికి ఇష్టపడతారు.. వారు ఉదయం ఒక కప్పు టీ తాగకుండా ఎటువంటి కార్యకలాపాలు మొదలపెట్టలేరు. ఒకరకంగా చెప్పాలంటే టీలో యాంటీ ఆక్సిడెంట్లు లేదా కాటేజిన్స్ వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి టీ తాగే వారిలో రోగ నిరోధక శక్తిని మరియు జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. అయితే వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ మీరు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు.. సాధారణంగా ఎక్కువమంది బ్లడ్ కాఫీ తాగటానికి ఇష్టపడతారు.. బెడ్ కాఫీ లేదా టీ ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇందులో కెఫీన్ అంశం అధికంగా ఉంటుంది.

ఇది కడుపులో ఆమ్లాలను ప్రేరేపిస్తుంది. మరియు మీ జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మీరు ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు మీ ఆరోగ్యం పై ఇలా ప్రభావం చూపుతుంది. ఉదయం బ్లాక్ టీ తాగడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుందని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే బ్లాక్ టీం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఉదయం పరికడుపున బ్లాక్ టీ తాగడం వల్ల ఉబ్బరం ఏర్పడుతుంది. మరియు ఉదయం మీ ఆకలి తగ్గుతుంది.. అయితే టీ తాగకుండా ఉండలేని వాళ్ళకి ఈ విధంగా టీ తయారు చేసుకుని తాగవచ్చు… టీ పౌడర్ మానేసి కొన్ని పదార్థాలను వాటిలో చేర్చి టీ తయారు చేసుకుని ఈ విధంగా తాగి చూడండి. ఇలా తాగడం వలన యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరానికి చక్కగా అందుతాయి.. అలాగే ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. మనకి మంచి ఆరోగ్యాన్ని అందించే కొన్ని టీలు అలాగే విటమిన్ల టీలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…

మొట్టమొదటిది అల్లం చాయ్: ఈ అల్లం చాయ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. మరుగుతున్న నీటిలో ఒక అల్లం ముక్క దంచి వేయాలి. దాంట్లో కొంచెం పసుపును కూడా వేసి బాగా మరగించాలి. తర్వాత దానిని వడకట్టి కొంచెం గోరువెచ్చగా ఉండగానే తీసుకోవాలి. ఈ అల్లం చాయ్ రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది..

సిట్రస్ చాయ్; ఈ చాయ్ కి కావాల్సిన పదార్థాలు పుదీనా ఆకులు, కొంచెం టీ పౌడర్, నిమ్మకాయ, నారింజ, బత్తాయి ఇలా నచ్చిన ఫ్రూట్ ని యాడ్ చేసుకోవచ్చు..

Start drinking these tea in the day and you will have excellent health

Start drinking these tea in the day and you will have excellent health

ముందుగా కొంచెం టీ పౌడర్ కొన్ని పుదీనా ఆకుల్ని వేసి నీటిలో మరిగించాలి. వాటిని వడకట్టి దానిలో నిమ్మకాయ లేదా ఏదైనా సిట్రస్ పండుని తీసుకొని దానిలో ఆ జ్యూస్ ని పిండాలి. దానిలో కొంచెం తేనెను కలిపి తాగాలి. ప్రతిరోజు ఈ టీ తాగడం వలన మీ శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఈ పుదీనాలో విటమిన్ ఏ, సి లు అధికంగా ఉంటాయి. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కావున ఈ టీ మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది..

దాల్చిన చెక్క చాయ్: ఓ పాత్రలో కొన్ని నీటిని పోసి దానిలో దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టుకుని గోరువెచ్చగా ఉండగానే తీసుకోవాలి. దాల్చిన చెక్కలో విటమిన్ ఏ, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే వాపులు తగ్గుతాయి. ఇది బ్యాక్టీరియా ఫంగస్ తో పోరాడి మనల్ని వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అలాగే బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది చాలా సహాయకరంగా ఉంటుంది..

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది