Strawberry Fruits : డయాబెటిస్ పేషెంట్స్ స్ట్రాబెర్రీస్ తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి…!
ప్రధానాంశాలు:
Strawberry Fruits : డయాబెటిస్ పేషెంట్స్ స్ట్రాబెర్రీస్ తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి...!
Strawberry Fruits : ప్రస్తుతం వయసు తరహా లేకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న సమస్య. మధుమేహం. ఈ సమస్యతో చాలామంది కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండవలసి వస్తుంది. శరీరంలో ఉండే షుగర్ లెవెల్స్ ను హెచ్చుతగ్గుల వల్ల ఈ పరిస్థితి వస్తుంది. అయితే షుగర్ ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే సరైన ఆహారాలను తీసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఆహార పదార్థాల నియమాలు తప్పక పాటించాలి. పండ్లు కూరగాయల విషయంలో కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే డయాబెటిస్ బాధితులు స్ట్రాబెరీ పండ్లను తింటే ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం.
స్ట్రాబెరీస్ చూడడానికి చిన్నగానే ఉంటుంది. కానీ దీంతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. స్ట్రాబెరీలు తీపి రుచులు కలిగి ఉంటాయి. వివిధ ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.. స్ట్రాబెరీ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ స్ట్రాబెరీ లలో విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు స్ట్రాబెర్రీ తినడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు. స్ట్రాబెరీలు సహజ చక్కెర ఉన్నప్పటికీ తక్కువ గ్లైసిమిక్ కలిగి ఉంటుంది.
కావున రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. స్ట్రాబెరీల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చక్కెర షోషను మెరుగుపరుస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అలాగే ఫైబర్ బరువుని కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆంటీ ఇంప్లిమెంటరీ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ కలిగి ఉంటాయి. స్ట్రాబెరీలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కావున డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు స్ట్రాబెరీస్ తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.