Eye Sight : ఎండవేడికి పెరుగుతున్న డ్రై ఐ సిండ్రోమ్ బాధితులు… కంటి చూపులో ఈ సమస్యలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Eye Sight : ఎండవేడికి పెరుగుతున్న డ్రై ఐ సిండ్రోమ్ బాధితులు… కంటి చూపులో ఈ సమస్యలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 May 2024,9:00 am

Eye Sight : ప్రస్తుతం మన దేశంలోనే చాలా ప్రాంతాలలో విపరీతమైన వేడిని ఎదుర్కొంటున్నాము. అలాగే దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. వేడితో పాటుగా వడగల్పులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దీనివలన ప్రజలు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటున్నది. హిట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ కడుపుకు సంబంధించిన కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ వేడి కారణం వలన ప్రజలు కూడా డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. ఈ డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడిన వ్యక్తులకు సమయానికి చికిత్స చేయకపోతే కళ్ళు దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. కావున డ్రై ఐ సిండ్రోమ్ అంటే ఏమిటి. దానిని ఎలా నివారించవచ్చు. వైద్యులు చెప్పిన సలహా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వైద్యులు చెప్పిన ప్రకారం చూస్తే అధిక వేడి కారణం వలన కంటికి సంబంధించిన వ్యాధి డ్రై ఐ సిండ్రోమ్ బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇది కళ్ళల్లో తగినంత ద్రవం ఉత్పత్తి కానప్పుడు సంభవిస్తుంది. దీనివల్ల కళ్ళు పొడి వారి దురదగా ఉంటాయి. సకాలంలో దీనికి చికిత్స గనుక చేయకపోతే దృష్టి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించిన కేసులు చాలా ఎక్కువగా ఆసుపత్రులకు వస్తున్నాయి…

Eye Sight : డ్రై ఐ సిండ్రోమ్ సమస్య ఎందుకు వస్తుందంటే

ఈ విషయంపై ఢిల్లీలో సర్ గంగారావు హాస్పిటల్ లోని కంటి విభాగం హెచ్ ఓ డి ప్రొఫెసర్ డాక్టర్ ఎకే గ్రోవర్ మాట్లాడుతూ, ప్రస్తుతం చాలా మంది రోగులు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. హీట్ వేవ్ విపరీతమైన వేడి కారణం వలన ఇది జరుగుతుంది. ఎండలో ఎక్కువసేపు ఉండేవారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కళ్ళల్లో మంట, కళ్ళల్లో తేమ తగ్గటం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వేడి కారణం వలన టియర్ ఫిల్మ్ అనేది ఎండిపోతుంది అని డాక్టర్ గ్రోవర్ తెలిపారు. దీనితో కళ్ళు వాచిపోవడం, తేమ తగ్గటం,కళ్ల వాపులు రావడం లాంటి వాటిని డ్రై ఐ సిండ్రోమ్ అంటారు. విపరీతమైన వేడి కారణం వలన కార్నియల్ బర్న్ కూడా వస్తుంది. దీంతో చూపు అనేది మనదిగించే సమస్య కూడా వస్తుంది. ఈ సమస్యలకు సకాలంలో చికిత్స అనేది అందించకపోతే కంటికి నష్టం అనేది జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పటికే కంటి సమస్యలు ఉన్నవారి దృష్టికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సూర్య రశ్మి నేరుగా కంటిపై పడటం వలన ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. సూర్యుడి అతినీలలోహిత కిరణాలు కళ్ల పై పడినప్పుడు ఈ కార్నియా ను కూడా ప్రభావితం చేస్తుంది. అప్పుడే కార్నియల్ బర్న్ కు కారణం అవుతుంది. ఇది కళ్ల కు ఎంతో తీవ్రమైన హాని కలిగిస్తుంది.

Eye Sight ఎండవేడికి పెరుగుతున్న డ్రై ఐ సిండ్రోమ్ బాధితులు కంటి చూపులో ఈ సమస్యలు

Eye Sight : ఎండవేడికి పెరుగుతున్న డ్రై ఐ సిండ్రోమ్ బాధితులు… కంటి చూపులో ఈ సమస్యలు..!

Eye Sight కళ్ళను ఎలా రక్షించుకోవాలి అంటే

1. బయటికి వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ను తప్పనిసరిగా ధరించాలి.
2. చల్లరి నీళ్లతో కళ్ళను కడుక్కోవాలి.
3. వైద్యులను సంప్రదించిన తర్వాత కంటిలో ఐ డ్రాప్స్ ను ఉపయోగించాలి.
4. ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది