Weight Loss : వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే తొమ్మిది రోజులలో అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Weight Loss : వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే తొమ్మిది రోజులలో అధిక బరువుకి చెక్ పెట్టవచ్చు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 February 2023,7:00 am

Weight Loss : చాలామంది అధిక బరువు ఊబకాయంతో ఎంతో సతమతమవుతూ ఉన్నారు.. బరువు తగ్గడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదు అని బాధపడుతూ ఉంటారు.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ప్రధానం మంచి ఆహారాలు తీసుకుంటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. నిత్యం ఖాలి కడుపుతో నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన శరీరానికి చాలా రకాల ఉపయోగాలు అందుతాయి. అదేవిధంగా సీజనల్ మారడం కారణంగా వచ్చే ఎన్నో వ్యాధులు కూడా ఎంతో సింపుల్గా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కావున నిత్యం ఎటువంటి డ్రై ఫ్రూట్స్ తినడం వలన ఈజీగా బరువు తగ్గుతారు ఇప్పుడు మనం చూద్దాం…

Taking these on an empty stomach can check Weight Loss in nine days

Taking these on an empty stomach can check Weight Loss in nine days

ఎండి ఖర్జూరాలు : ఎండు ఖర్జూరం లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇది పోషకాల నిధిగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్తుంటారు. దీనిలో ఉండే లక్షణాలు శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. కావున రాత్రిపూట వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వలన శరీరానికి ఐరన్ పరిమాణం పెరుగుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. కావున శరీర బరువు సమస్యలతో ఇబ్బంది పడేవారు నిత్యం ఖాళీ కడుపుతో ఎండు ఖర్జూరాలను తినడం వలన శరీరానికి మంచి ఉపయోగాలు కలుగుతాయి.. ఎండు ద్రాక్ష : ఎండు ద్రాక్ష శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ మొదలైనవి అధికంగా ఉంటాయి. కావున ఈ ఎండుద్రాక్షాన్ని నానబెట్టి ప్రతిరోజు ఖాళీ కడుపుతో తినడం వలన శరీరంలోని

Taking these on an empty stomach can check Weight Loss in nine days

Taking these on an empty stomach can check Weight Loss in nine days

బలహీనత తొలగిపోవడంతో పాటు బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కావున వీటి నుంచి మంచి ఫలితాలు పొందాలంటే కేవలం ఖాళీ కడుపుతో మాత్రమే తీసుకోవాలి. నిత్యం ఎండుద్రాక్షను తీసుకోవాలంటే ప్రతి రాత్రి ఆరు ఎండు ద్రాక్షాలు నీటిలో నానబెట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో తీసుకోవాలి. బాదం బాదం లో ఉండే గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. బాడికి కావలసిన పోషకాలను అందిస్తుంది. అయితే దీనిలో ఉండే ప్రోటీన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కావున రోజు ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది