Joint Pains : ఈ ఒక్కటి తీసుకుంటే చాలు 99% మీ మోకాళ్ళ నొప్పి జాయింట్ పెయిన్స్ మటుమాయం…!!
Joint Pains : అసలు ఎముకలు ఎందుకు బలహీనమవుతాయి. ఎటువంటి ఆహారం తీసుకుంటే ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. మన ఎముకలు బలహీనంగా మారాయి అనడానికి ఎటువంటి సంకేతాలను బట్టి గుర్తించవచ్చు. అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. తీవ్రమైన కీళ్ల నొప్పులు చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం ఎక్కువసేపు ఏ పని చేయలేకపోవడం ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మరి వీటికి కారణాలేంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీకున్న అలవాట్లు అవును ఫ్రెండ్స్ మీకు ఉండే కొన్ని అలవాట్ల వల్లే పుష్టిగా ఉండే మీ ఎముకలు ఇలా డొల్లగా మారిపోతాయి. ఎక్కడో చోట చిన్న పొరపాటు చేస్తుంటాం. అందువల్లే ఇటువంటి అనారోగ్యాలకు గురవుతూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా ఉప్పు ఈ ఉప్పు అనేది మనం తీసుకునే ఆహారం రుచిగా ఉంటుంది.
అని అనుకుంటాం తప్ప మన శరీరంలో అధిక మోతాదులో చేరిపోతుందని గ్రహించే లోపే జరగాల్సిన నష్టం ఇదిగో ఇలా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఎముకలకు ఉప్పు ఏమాత్రం మంచిది కాదు. అతిగా ఉప్పు తీసుకోవడం వల్ల ఎముకలు క్రమంగా బలహీన పడిపోతాయి. ముఖ్యంగా ఎముకలకు కావాల్సింది కాల్షియం. ఇది లోపిస్తే చాలా వరకు ఎముకలు మన మాట వినవు. బలహీనంగా మారిపోయి కీళ్ల నొప్పులు పుడతాయి. అందుకే ఒక వ్యక్తికే రోజుకు ఎంత మొత్తంలో క్యాల్షియం అవసరం అవుతుందో డాక్టర్ని సంప్రదించి తెలుసుకొని ఆ విధంగా వాడడం మంచిది. మనకి క్యాల్షియం సమృద్ధిగా పాలలో దొరుకుతుంది. అలాగే పాల ఉత్పత్తుల్లో కూడా ఉంటుంది. మరి వాటికేం కావాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కీళ్ల నొప్పులు, కాళ్ళు నొప్పులు
ఆర్థరైటిస్కు సంబంధించి మనం ఆముదాన్ని ఎలా వాడాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ పోయండి. ఇప్పుడు ఈ వాటర్ లో ఒక అర స్పూన్ వరకు సొంటి పొడిని కలపండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి నీటిని బాగా మరిగించండి. ఇలా మరుగుతుండగా ఒక స్పూన్ వాము రెండు బిర్యానీ ఆకులు వేయండి ఇప్పుడు ఈ నీటిని బాగా మరిగించండి. అంటే రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాం కదా అవి ఒక గ్లాసు అయ్యేంతవరకు మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే వడకట్టుకోండి. ఇప్పుడు ఈ కషాయాన్ని మీరు ఇలాగే తీసుకోవచ్చు. లేదంటే రుచి కోసం కొంచెం బెల్లం పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఈ డ్రింక్ ని మీరు ప్రతి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకోవచ్చు. అయితే రోజులో ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి.