Tea Side Effects : టీ, కాఫీలు గురించి బయటపడ్డ భయంకర రహస్యం.. ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా… ఈ విషయం తెలిస్తే చచ్చిన తాగరు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea Side Effects : టీ, కాఫీలు గురించి బయటపడ్డ భయంకర రహస్యం.. ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా… ఈ విషయం తెలిస్తే చచ్చిన తాగరు..!

 Authored By aruna | The Telugu News | Updated on :15 November 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea Side Effects : టీ, కాఫీలు గురించి బయటపడ్డ భయంకర రహస్యం..

  •  ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతున్నారా... ఈ విషయం తెలిస్తే చచ్చిన తాగరు..!

Tea Side Effects : మనలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ, లేదంటే కాఫీ తాగటం ఒక అలవాటుగా మారిపోయింది. ఒక్క పూట టీ తాగకపోతే ఏదో కోల్పోతున్న ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఒక కప్పు టీ తాగితే బాగుంటుంది. టీ మన జీవితంలో ఒక భాగమైపోయింది.మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది మనం ఏదైనా తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటే దాని వల్ల లాభాలు కన్నా ఎక్కువ నష్టాల్ని చూడాల్సి ఉంటుంది. నిజంగానే పరగడుపున బ్రేక్ఫాస్ట్ చేయకముందు ఖాళీ కడుపు తో ఒకవేళ తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన పెద్దలు చెప్పింది నిజమే కానీ ముఖ్యంగా ఎసిడిటీ సమస్యతో బాధపడే వాళ్ళు టీ అస్సలు తాగకూడదు.. ఎందుకంటే చాయ్ తయారీ కోసం ఉపయోగించే టీ పౌడర్ లో ఉండే కెఫిన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి కడుపులో ఆసిడ్ ఉత్పత్తికి కారణంగా మారుతాయి.

ఒకవేళ ఎస్పిటి సమస్యతో బాధపడేవారు ఉదయంనే పరగడుపున టీ, కాఫీలు తాగితే ఆసిడ్ లెవెల్స్ మరింత పెరిగిపోతాయి. దీంతో ఐరన్ లోపం వచ్చి ఎనిమియా సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే వికారం, అలసట మొదలైన సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు అస్సలు తాగకూడదు. అలాగే మరి ఎక్కువగా టీ, కాఫీలను తాగటం వల్ల జీర్ణ క్రియ పనితీరు మందగిస్తుంది. దీనివల్ల ఎన్నో రకాల జీర్ణ సంబంధ సమస్యలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. టీ కాఫీలు ఎక్కువ తాగడం వలన ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. టీ పౌడర్ లో ఉండే కొన్ని పదార్థాలు ఎముకలను బలహీన పరుస్తాయి. దీనివల్ల మనకు కీళ్ల నొప్పులు మొదలైపోతాయి. ఇంకా మనలో చాలామంది వేడివేడిగా తాగటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎక్కువ వేడిగా ఉండే టీ లేదంటే కాఫీ ని తాగటం వల్ల కడుపులోని ఉపరితలం దెబ్బతింటుంది. భవిష్యత్తులో గొంతు క్యాన్సర్ కి కూడా దారి తీస్తోంది.

ఇలా తాగడం వెంటనే మానుకోండి. వేడివేడిగా పొగలు కక్కుతూ ఉన్న టీ కాఫీలను అస్సలు తాగకండి. ఇంకా టీ, కాఫీలను ఎక్కువగా తాగటం వల్ల ఆకలి మందకిస్తోంది. ఇది హార్ట్ పై ప్రభావాన్ని చూపిస్తోంది. హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తోంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకటి నుంచి రెండు గంటలు ఆగి ఆ తర్వాత తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం హెల్తీగా ఉండొచ్చు.. అలాగే ఎప్పుడు కూడా ఖాళీ కడుపున టీ తాగకండి..ఇంకా సాయంత్రం పూట స్నాక్స్ తీసుకున్న తర్వాత ఒక గంట ఆగి టీ తాగినా కూడా పర్వాలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది