Ladies Finger : కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండటమే బెటర్…!
Ladies Finger : ప్రస్తుతం మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. ఈ కూరగాయలలో ఒకటి బెండకాయ. బెండకాయను ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఇవి మార్కెట్లో తక్కువ ధరలో లభించే కూరగాయలలో ఒకటి బెండకాయ కూడా. వారంలో ఒక్కసారైనా బెండకాయను తీసుకుంటూ ఉంటాం. బెండకాయ వలన ఆరోగ్యానికి జరిగే మేలు కూడా అలాంటిది మరి. అందుకే వైద్యులు కూడా బెండకాయను మన ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా దీనిలో పుష్కలంగా లభించే గ్లైసోమిక్ రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచేలా చేస్తాయి. అందుకే షుగర్ పేషెంట్స్ కచ్చితంగా ఆహారంలో బెండకాయను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
అంతే బెండకాయలు తినడం వలన శరీరంలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించవచ్చు. ఈ బెండకాయను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. అంతేకాక కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా బెండకాయను తీసుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ బెండకాయ కొంతమందికి మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెండకాయ దూరంగా ఉండటమే మంచిది అని చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెండకాయ తీసుకోవడం పూర్తిగా మానేయాలి అని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే. కిడ్నీ గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నట్లయితే, బెండకాయకు దూరంగా ఉండాలి అని నిపుణులు హెచ్చరించారు. గ్యాస్,ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా బెండకాయను తీసుకోకుండా ఉండటమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో ఎక్కువగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థకు మేలు చేసిన, గ్యాస్ లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది అని వైద్యులు తెలిపారు.
ఇక తరచుగా జలుబు, దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలని నిపుణులు తెలిపారు. ఈ బెండకాయ అనేది శీతలికరణ ప్రభావాన్ని చూపుతుంది. ఇది జలుబు, దగ్గు మరింత పెరగటానికి కూడా కారణం అవుతుంది. మరి ముఖ్యంగా సైనస్ సమస్య ఉన్నవారు కూడా ఈ బెండకాయకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. బలహీనమైన జీర్ణ శక్తి ఉన్నటువంటి వారు కూడా బెండకాయ కు వీలైనంత దూరంగా ఉండాలి అని వైద్యులు తెలిపారు. దీంతో ఈ సమస్య అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని అంటున్నారు నిపుణులు…