Diabetes : డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు చర్మంపై దద్దుర్లు ఎందుకు వస్తాయి.. ఎలా రక్షించుకోవాలంటే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు చర్మంపై దద్దుర్లు ఎందుకు వస్తాయి.. ఎలా రక్షించుకోవాలంటే…?

Diabetes : ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరంలో ఒకటి మధుమేహం కూడా.అయితే మధుమేహం అనేది ఎంతో తీవ్రమైన ఆరోగ్య సమస్య అని చెప్పొచ్చు. ఈ వ్యాధి అనేది శరీరంలో ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. దీనిలో చర్మం కూడా ఒకటి. అయితే డయాబెటిస్ పేషెంట్లకు ఏదో ఒక టైమ్ లో చర్మంపై దద్దుర్లు లేక ఇతర చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున మధుమేహ బారిన పడినటువంటి […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Diabetes : మధుమేహ ప్రధాన లక్షణాలు ఇవే... ఎలా రక్షించుకోవాలంటే...?

Diabetes : ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరంలో ఒకటి మధుమేహం కూడా.అయితే మధుమేహం అనేది ఎంతో తీవ్రమైన ఆరోగ్య సమస్య అని చెప్పొచ్చు. ఈ వ్యాధి అనేది శరీరంలో ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. దీనిలో చర్మం కూడా ఒకటి. అయితే డయాబెటిస్ పేషెంట్లకు ఏదో ఒక టైమ్ లో చర్మంపై దద్దుర్లు లేక ఇతర చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున మధుమేహ బారిన పడినటువంటి వారు చర్మంపై దురద తో ఇబ్బంది పడతారు. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తుల చర్మంపై దురద మరియు దద్దుర్లు ఏర్పడి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ మధుమేహం అనేది శరీరంలో చక్కర స్థాయిని పెంచగలదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాక శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు మరియు ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కానప్పుడు మధుమేహ వ్యాధి బారిన పడతారు అని అంటున్నారు.

అయితే ఇన్సులిన్ అనేది శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఎంతో సహాయపడే హార్మోన్. అయితే ఈ హార్మోన్ సరిగా పని చేయనప్పుడు చక్కెర స్థాయి అనేది పెరగవచ్చు. అలాగే ఇది మధుమేహానికి కూడా దారి తీయవచ్చు. మధుమేహం అనేది రెండు రకాలు : మదుమేహానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కారణాలలో ఒకటి జన్యుపరమైనది అనగా కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉన్నట్లయితే వారసులు దాని బారిన పడే అవకాశం కూడా ఉన్నది. దీనిని టైపు -1 డయాబెటిస్ అని పిలుస్తారు. అంతేకాక చెడు ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలి కూడా షుగర్ కి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇలా వచ్చే మధుమేహాన్ని టైప్-2 డయాబెటిస్ అని పిలుస్తారు…

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు దద్దుర్లు ఎందుకు వస్తాయి : ఎన్నో కారణాల చేత కూడా డయాబెటిస్ ఉన్నవారికి చర్మంపై దద్దులనేవి వస్తాయి అని ఆర్ఎంఎల్ హాస్పిటల్ డెర్మటాలజీ విభాగం మాజీ అధిపతి డాక్టర్ బావుక్ ధీర్ తెలిపారు. అయితే శరీరంలో చక్కెర స్థాయి అనేది నియంత్రించడం వలన కూడా శక్తి అనేది లోపిస్తుంది. దీని కారణం చేత చర్మ కణాలు అనేవి ప్రభావితం అవుతాయి. అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంతేకాక షుగర్ పేషెంట్ కు నివారణ కోసం మందులు తీసుకున్నట్లయితే చర్మం దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇలా స్కిన్ పై ఇబ్బందులు వచ్చినట్లయితే మందులను మార్చుకోవాలి అని వైద్యులు అంటున్నారు. అందుకని ఈ సందర్భాలలో బాధితులు కచ్చితంగా వైద్యులను సంప్రదించడం మంచిది.

Diabetes డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు చర్మంపై దద్దుర్లు ఎందుకు వస్తాయి ఎలా రక్షించుకోవాలంటే

Diabetes : డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు చర్మంపై దద్దుర్లు ఎందుకు వస్తాయి.. ఎలా రక్షించుకోవాలంటే…?

Diabetes ఎలా రక్షించుకోవాలంటే

1.రక్తంలో సుగర్ లెవల్స్ ను తగిన స్థాయిలో ఉంచుకోవాలి.
2. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే మాయిశ్చరైజింగ్ సబ్బులను వాడటం మంచిది కాదు.
3. చర్మాన్ని ఎప్పుడూ కూడా తేమగా వచ్చేందుకు సిరా మైడ్ క్రీమ్ వాడటం మంచిది.
4. ఒక టవల్ తో చర్మాన్ని సున్నితంగా తుడుచుకోవాలి. అలాగే చర్మం పొడిగా ఉండేలా చూసుకోవాలి.
5. చర్మాని కూడా ఎంతో హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది