Cholesterol : ఈ ఫ్రూట్స్ ప్రతీ రోజు ఐదు తీసుకుని.. కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గించుకోండి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cholesterol : ఈ ఫ్రూట్స్ ప్రతీ రోజు ఐదు తీసుకుని.. కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గించుకోండి..

 Authored By mallesh | The Telugu News | Updated on :15 January 2022,9:10 am

Cholesterol : ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో రకరకాల కారణాల వలన మనుషుల్లో బాగా కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నది. ఇందుకు ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడమేనని తెలుస్తోంది. కాగా, దాంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మెయిన్ రీజన్‌గా ఉంటున్నది. ఈ సంగతులు అలా ఉంచితే..ఇక పెరిగిన కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా చేస్తే కనుక కంపల్సరీగా కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది. అదేంటో తెలుసుకుందాం.జనరల్‌గా కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకుగాను అందరూ వ్యాయామం చేయాలని చెప్తుంటారు. వైద్యులు కూడా ఈ సూచన చేస్తుంటారు.

కాగా, వ్యాయామంతో పాటు ప్రతీ రోజు ఈ ఫ్రూట్స్ ఐదు తీసుకుంటే కనుక చాలా చక్కటి ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ఆ ఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం. స్ట్రాబెర్రీలు, యాపిల్స్, సిట్రస్ ఫ్రూట్స్, ద్రాక్ష, అవోకాడో.. ఈ ఫ్రూట్స్ ప్రతీ రోజు ఐదు తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. వీటిలో ఉన్న పోషకాలేంటంటే..అత్యంత టేస్టీ ఫ్రూట్స్ ‘స్ట్రాబెర్రీల’ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సౌందర్య సాధనాలలో వీటిని ఉపయోగిస్తుంటారు. ఇవి హ్యూమన్ బాడీలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వలన స్కిన్ కు గ్లోనెస్ కూడా లభిస్తుంది.

these fruits five a day you will decrease cholesterol

these fruits five a day you will decrease cholesterol

Cholesterol : వ్యాయామంతో పాటు ఈ పని చేయాలి…

ఇకపోతే యాపిల్స్ తింటే చాలా మంచిదని వైద్యులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు కూడా. ఇందులో ఉండేటువంటి పెక్టిన్ అనే ఎలిమెంట్ హ్యూమన్ బాడీలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఇది హెల్త్‌కు చాలా మంచిది.సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్స్ ద్రాక్ష, నిమ్మ, నారింజ..ల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చలి కాలంలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. విటమిన్ సి వలన హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ద్రాక్ష కూడా కొలెస్ట్రాల్ తగ్గించేందుకుగాను సాయపడుతుంది. అవోకాడో తీసుకోవడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది