మన శరీరంలో ముఖ్యమైన జాయింట్ ఇదే.. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి..!
చాలా మందిని వేదించే సమస్య కీళ్ల నొప్పులు అయితే చిన్న వయసు నుంచి సమస్య అనేది వస్తూ ఉంటుంది. రకరకాల ట్రీట్మెంట్ తీసుకున్నాక అనే కీళ్ల సమస్యకు పరిష్కారం లేదని కూడా చెప్తుంటారు. అయితే ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు. అని చెప్తున్నారు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ నరేష్ గారు. ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఆహార అలవాట్లు మార్పుల కారణంగా చాలామంది అధిక బరువు పెరిగిపోవడం దాని వలన మోకాళ్ళ నొప్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.
మన బరువు అనేది మోసేది మోకాళ్లు. ప్రతి కదలికలోనూ మోకాలు సేవలు కీలకంగా పనిచేస్తూ ఉంటాయి. మన జీవితకాలంలో 90% బరువుని మోసే ముఖ్యమైన జాయింట్ మోకాలు. మనం వంగినప్పుడు లేదా నడవడం లేదా మెట్లు ఎక్కడ డాన్స్ చేయడం లేదా బరువులేత్తినప్పుడు మోకాళ్లు పనితీరు కఠినంగా మారుతూ ఉంటుంది. అలాంటి మోకాళ్లు ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని రకాల ఎక్సర్సైజులు తప్పకుండా చేస్తూ ఉండాలి. సైకిల్ తొక్కడం, నడవడం, చిన్నచిన్న ఎక్సైజ్ చేయడం లాంటివన్నీ మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజువారీగా ఇంట్లోనే కొన్ని చిన్న చిన్న ఎక్సైజ్లు చేసుకోవచ్చు. మోకాళ్లపై అధిక బరువు ప్రభావం పడకుండా ఉండాలంటే శరీర బరువు పరిమితికి మించి లేకుండా చూసుకోవాలి. ఒక ఐడియల్ వెయిట్ అనేది ఉండేలా చూసుకోవాలి.
అలాగే సరైన పాదరక్షలను ధరిస్తూ ఉండాలి. వాకింగ్ తప్పకుండా చేయాలి. బరువులు ఎత్తడం తదితర కీలకమైన వ్యాయామలు చేయడానికి ముందు మోకాళ్ళ గురించి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఒకేసారి అధిక బరువు మోకాళ్లపై వేయకుండా నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి.. ఈ విధంగా చేయడం వలన మోకాళ్ళ మీద బరువు పడకుండా చూసుకోవచ్చు. అలాగే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు.. అలాగే కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటూ ఉండాలి.