Copper Water Bottles : కాపర్ వాటర్ బాటిల్ వాడేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి.. లేదంటే అంతే…!
ప్రధానాంశాలు:
Copper Water Bottles : కాపర్ వాటర్ బాటిల్ వాడేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి.. లేదంటే అంతే...!
Copper Water Bottles : కాపర్ బాటిల్ వాడేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. నిమ్మకాయ నీరు, జ్యూస్ లేదా సోడా లాంటి ఆమ్లత కలిగిన ద్రవాలను రాగి సీసాలో నిల్వ చేయకండి. వీటిలోని ఆమ్ల పదార్థాలు రాగితో చర్యకి దారి తీయవచ్చు, ఇది ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. కాపర్ బాటిల్‌లో గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న త్రాగునీటిని మాత్రమే వాడాలి.

Copper Water Bottles : కాపర్ వాటర్ బాటిల్ వాడేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి.. లేదంటే అంతే…!
Copper Water Bottles : ఈ నియమాలు తప్పనిసరి..
రాత్రిపూట రాగి సీసాలో నీటిని నింపి, ఉదయం తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే అదే నీటిని రెండు రోజులకిపైగా వాడకండి. దీని వల్ల రాగి అధికమోతలో నీటిలో కలిసిపోవచ్చు – ఇది విషపూరితంగా మారే ప్రమాదం ఉంది. రాగి బాటిల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. గట్టి స్క్రబ్ అవసరం లేదు, కానీ ఉప్పు, చింతపండు లేదా నిమ్మకాయతో శుభ్రం చేయడం మంచిది. లేకపోతే ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి ఆక్సీకరణ జరుగుతుంది, ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది.
తడి బాటిల్‌ను మూసి ఉంచడం వల్ల లోపల తేమ ఉండి చెడు వాసన వస్తుంది, రంగు మారుతుంది. కడిగిన తర్వాత మూత తీసేసి బాటిల్‌ను గాలి జారే ప్రదేశంలో పూర్తిగా ఆరనివ్వండి. ఇది దీర్ఘకాలం తాజాగా ఉంచుతుంది. కాపర్ బాటిల్‌లో నీరు తాగడం ఆరోగ్యకరమే కానీ అతిగా తాగితే వికారం, కడుపునొప్పి, అసహజమైన రియాక్షన్లు రావచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగడం సరిపోతుంది. ఈ చిట్కాలు పాటిస్తే, మీరు రాగి సీసా ప్రయోజనాలను సురక్షితంగా ఆస్వాదించవచ్చు