Cooking Oils : వంట గదిలో ఎలాంటి నూనె ను ఉపయోగిస్తున్నారు… కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్…

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: August 7, 2024, 4:00 pm
  •  Cooking Oils : వంట గదిలో ఎలాంటి నూనె ను ఉపయోగిస్తున్నారు... కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్...

Cooking Oils : ప్రసుత కాలంలో ప్రతి ఇంట్లో ఒక్కరైనా కొలెస్ట్రాల సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొలెస్ట్రాల్ నిర్ధారణ అయిన వెంటనే ఆహారంపై శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ఒంట్లో కొలెస్ట్రాలను గుర్తించిన తర్వాత కొవ్వు ఉన్న పదార్ధాలను తినడం తగ్గించాలి. వెన్న, నెయ్యి, జున్ను ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు. కాని ప్రతి రోజు వంటకాలలో నూనెను తగ్గించడం కొంచెం కష్టం అనే చెప్పాలి. చాలామంది ఉడకబెట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు కానీ అలా చేయకూడదు. నూనె కూడా వాడాలి. అలా అని ఎక్కువగా వాడకూడదు కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిది.

ఆహారంలో నాణ్యతలేని నూనె వాడితే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏ నూనెను వాడితే ఆరోగ్యం బాగుంటుందంటే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనెలో మోనో-అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అందుకే రోజువారీ వంటలలో ఆలివ్ నూనెను ఉపయోగించాలి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు వంటలో పొద్దుతిరుగుడు నూనెను కూడా ఉపయోగించవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. పొద్దుతిరుగుడు నూనెలో బహుళ అసంతృప్త మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.అవిసె గింజల నూనెలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఒక రకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి.

Cooking Oils : వంట గదిలో ఎలాంటి నూనె ను ఉపయోగిస్తున్నారు... కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్...

Cooking Oils : వంట గదిలో ఎలాంటి నూనె ను ఉపయోగిస్తున్నారు… కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్…

అవిసె గింజల నూనె శరీరంలో మంటను మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. సోయాబీన్ నూనెను కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. అయితే నువ్వుల నూనెలో బహుళ అసంతృప్త మోనోశాచురేటెడ్ కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp