Lose Weight : మహిళలకు అన్నం,చపాతీల కంటే ఈ ఫుడ్ బెస్ట్…బరువు తగ్గాలంటే వెంటనే ట్రై చేయండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lose Weight : మహిళలకు అన్నం,చపాతీల కంటే ఈ ఫుడ్ బెస్ట్…బరువు తగ్గాలంటే వెంటనే ట్రై చేయండి…

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Lose Weight : మహిళలకు అన్నం,చపాతీల కంటే ఈ ఫుడ్ బెస్ట్...బరువు తగ్గాలంటే వెంటనే ట్రై చేయండి...

Lose Weight : సగ్గు బియ్యం అనేవి దాదాపు అందరూ ఇళ్లల్లో ఉంటాయి. అయితే ఇవి తెల్లగా ముత్యాల మాదిరిగా మెరుస్తూ ఉన్న ఈ సగ్గుబియ్యం లో ఎన్నో ఆరోగ్య పోషకాలు దాగి ఉన్నాయి. అయితే వీటికి సొంత రుచి అంటూ లేకపోవడంతో ఇతర రకాల ఆహార పదార్థాల తో కలిపి తీసుకుంటూ ఉంటాం. అనగా పండ్లు, మసాలాలు, కిచిడి లాంటివి తయారు చేసుకొని తింటూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలంటే. ఉపవాసం విరమించిన తర్వాత సగ్గుబియ్యంతో చేసిన ఆహారాన్ని తినెందుకు ఎంతో ఇష్టపడతారు. అయితే అప్పుడప్పుడు తీసుకునే సగ్గుబియ్యంతో చేసిన ఆహారాన్ని ప్రతినిత్యం గంజీ రూపంలో తీసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది అని వైద్య నిపుణులు తెలిపారు. సగ్గుబియ్యం లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ సగ్గుబియ్యం మంచి ఫుడ్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే. మహిళలకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది…

ఒక కప్పు సగ్గుబియ్యం లో 544 కేలరీలు, 135 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఈ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం,ఐరన్,కాల్షియం లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తినడం వలన శరీరంలో పోషకాహార లోపం అనేది ఉండదు. ఎక్కువగా శరీరంలో పని చేసేందుకు వెంటనే శక్తిని, సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ ఆహారం అనేది బరువును తగ్గించడంలో ఎంతో బాగా పని చేస్తుంది. దీనిలో ఫైబర్ అనేది అధిక మోతాదులో ఉంటుంది. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు అధిక శాతం లో ఉండటం వలన ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీంతో ఆకలి అనేది ఉండదు. దీనిలో ఉండే ఫైబర్ జీవక్రియను పెంచేందుకు కూడా ఎంతో బాగా పని చేస్తుంది. కాబట్టి సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వలన తొందరగా బరువు తగ్గుతారు. అయితే మీరు మధ్యాహ్నం వేళలో అన్నం లేక చపాతీలు తినటం మానేసి సగ్గుబియ్యంతో చేసిన కిచిడిని తీసుకోవటం మంచిది. దీనిలో కార్బోహైడ్రేట్లో ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకోవటం వలన పని చేసే సామర్ధ్యం కూడా వస్తుంది.అలాగే అలసట మరియు బలహీనతతో ఉన్న టైంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా సగ్గుబియ్యంతో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు..

Lose Weight మహిళలకు అన్నంచపాతీల కంటే ఈ ఫుడ్ బెస్ట్బరువు తగ్గాలంటే వెంటనే ట్రై చేయండి

Lose Weight : మహిళలకు అన్నం,చపాతీల కంటే ఈ ఫుడ్ బెస్ట్…బరువు తగ్గాలంటే వెంటనే ట్రై చేయండి…

ప్రస్తుత కాలంలో చాలా మంది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కోసం చూస్తూ ఉంటారు. అయితే గ్లూటెన్ రహిత ఆహారం తినడం వలన బరువు తొందరగా తగ్గొచ్చు. అంతేకాక మధుమేహం, కొలెస్ట్రాల్, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. ఈ సందర్భంలో మీరు సగ్గుబియ్యాన్ని ఎంచుకోవచ్చు. వీటిని తీసుకోవడం వలన మీ శరీరంలో గ్లూటెన్ చేరే అవకాశం అసలు ఉండదు. ఈ సగ్గుబియ్యం అనేది గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరమైన ఆహారం అని చెప్పొచ్చు. ఈ ఆహారం లో ఫొలేట్ అనేది ఉంటుంది. ఈ పోషకాలు అనేవి గర్భధారణ టైంలో రక్తహీనత సమస్యలు తగ్గిస్తుంది. అలాగే పిండం పెరుగుదల మరియు ఆరోగ్యన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. డెలివరీ అయిన తర్వాత కూడా మీరు ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది తల్లి యొక్క పాలను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక ఇది రుతుస్రావ టైం లో ఇతర శారీరక సమస్యలను కూడా నియంత్రిస్తుంది. రక్తహీనత సమస్యలు తగ్గించేందుకు మహిళలు ప్రత్యేకంగా ఎంతో ఉపయోగకరమైన ఈ సగ్గుబియ్యాన్ని సరైన శరీర బరువును మెయింటైన్ చేయటంలో కూడా ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. రక్తహీనత తగ్గాలి అన్న కూడా వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది…

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది