Medicines : మందులు వేసుకునేటప్పుడు అందరూ చేసే తప్పు, ఇలా చేస్తే మెడిసిన్ పనిచేయదు.. తప్పక తెలుసుకోండి..!!
Medicines : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మనిషి రోగాలతో నిండిపోతున్నాడు. దానికి ప్రధాన కారణం కలుషితమైన వాతావరణంతో పాటు కలుషితమైన బయట దొరికే ఫుడ్. ఎవరికివారు తమ స్వలాభం కోసం డబ్బు సంపాదించడానికి వ్యర్థమైన కెమికల్స్ తో కూడిన వాటిని ఉపయోగిస్తూ రెస్టారెంట్లు.. ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. దీంతో చాలామంది రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. ఈ క్రమంలో మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. దీనిలో భాగంగా టాబ్లెట్ కొంతమంది గ్లాస్ వాటర్ తో వేసుకుంటారు మరి కొంతమంది టీ కాఫీలతో.. లేదా జ్యూసులతో కూడా టాబ్లెట్స్ వేసుకుంటారు. అయితే టాబ్లెట్ ఎప్పుడూ కూడా ఇలా వేసుకోకూడదు అంట.
ఇలా వేసుకోవడం వల్ల టాబ్లెట్ ప్రభావం పెద్దగా పనిచేయదట. అయితే టాబ్లెట్ శరీరంలో సరిగ్గా పని చేయాలంటే… గోరువెచ్చని నీటితో టాబ్లెట్ వేసుకోవడం ఉత్తమమైన మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. మామూలుగా అయితే చల్లని నీటితో టాబ్లెట్ పూర్తిగా కరగటానికి 40 నిమిషాల సమయం పడుతుందని దాని ఫలితం చూపించడానికి కనీసం నాలుగైదు గంటలు.. పట్టొచ్చు. ఈ లోపు మనిషి వ్యర్ధాలు గుండా వెళ్తే..ఇంకా దాని పవర్ తగ్గే అవకాశం ఉంటుందట. కాబట్టి గోరువెచ్చని నీటితో టాబ్లెట్ వేసుకోవడం వల్ల తొందరగా ఫలితం కనిపిస్తుందట. అదేవిధంగా చిన్నపిల్లలు టాబ్లెట్ వేసుకోవడానికి అసలు ఇష్టపడరు. వారికి పాలల్లోనే బాదం మిల్క్ లోనే టాబ్లెట్ నీ కలిపేసి ఇస్తుంటారు.
ఇలా ఇవ్వటం కూడా మంచిది కాదట. కొన్ని టాబ్లెట్స్ నీ పాలల్లో కలపటం వలన శక్తిని కోల్పోతుంటారట. ఉపసంబంటి వ్యాధులు రావడానికి కూడా కారణం అవుతాయట. మరికొందరు జ్యూసులతో తీసుకుంటూ ఉంటారు. టాబ్లెట్స్ చక్కెర పదార్థాలతో కలపటం వలన సహజ లక్షణాలను కోల్పోతారు. టాబ్లెట్స్ కేవలం గోరువెచ్చని నీటితో మాత్రం తీసుకోవడం ఉత్తమమైన మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.