లాంగ్ కొవిడ్ గురించి తెలుసా..? ఆ మూడు లక్షణాలు ప్రమాదమే..!
Covid 19 లక్షణాలు ఏమిటో దాదాపుగా అందరికి తెలుసు, కానీ లాంగ్ కొవిడ్ అనేది ఒకటి ఉందని, దాని లక్షణాలు ఏమిటి అనేది ఎవరికైనా తెలుసా..? అవును మీరు చదివింది నిజమే.. కొవిడ్ తగ్గిన తర్వాత దాని తాలూకా ప్రభావం ఉండటాన్ని లాంగ్ కోవిడ్ అని పిలుస్తారు. అంటే కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని కీలక సమస్యలతో బాధపడుతూ అనేక మంది వున్నారు వాళ్ళందరూ కూడా లాంగ్ కొవిడ్ పేషంట్స్ అనే చెప్పాలి… దీనిపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున పరిశోధనలు కూడా చేస్తున్నారు.
ఈ లాంగ్ కొవిడ్ లక్షణాలు ఉన్నవారిలో ఊపిరితిత్తులు, గుండె,కిడ్నీలు, మెదడు లాంటి అవయవాలకు నష్టం జరగకపోవచ్చు, కానీ వాటిపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. నిపుణులు చెపుతున్న వివరాలు ప్రకారం ఈ లాంగ్ కొవిడ్ కి సంబంధించి ఇప్పటికి కూడా సంపూర్ణ అవగాహన అనేది లేదు. కాకపోతే చిన్న స్థాయి డాక్టర్లు కూడా రోగిలో కనిపించేవి లాంగ్ కొవిడ్ లక్షణాలా.. లేదంటే ఇతర వ్యాధి లక్షణాలా..? అనే విషయాన్నీ ఈజీగా గుర్తించవచ్చని చెపుతున్నారు.
సాధారణ కరోనా వైరస్ ఉపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది.. కరోనా నెగిటివ్ వచ్చిన కానీ ఛాతిలో ఇబ్బందిగా ఉండటం, స్వల్పమైన నొప్పి ఉండటం లాంటివి లాంగ్ కొవిడ్ యొక్క లక్షణాలు అయివుండొచ్చని ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం అనేది కరోనా రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కరోనా తగ్గిన తర్వాత కూడా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది అనిపిస్తే దానిని కూడా లాంగ్ కొవిడ్ లక్షణంగా భావించవచ్చు, అదే విధంగా కొందరు కరోనా తగ్గిన తర్వాత కూడా మత్తుగా, ఎదో తెలియని కన్ఫ్యూజన్ ఉందని చెపుతుంటారు. దానిని బ్రెయిన్ ఫాగ్ అని పిలుస్తారు. ఇది కూడా లాంగ్ కొవిడ్ లక్షణమే అని అంటున్నారు పరిశోధకులు.
అయితే ఈ లాంగ్ కొవిడ్ వలన పెద్దగా ప్రమాదం లేకపోయిన కానీ ఇబ్బందులు మాత్రం తప్పవు. కాకపోతే వృద్దులు, మహిళలు. స్థూలకాయం ఉన్నవాళ్లు ఈ లాంగ్ కొవిడ్ వలన ఎక్కువ రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ ప్రాన్సిస్ కొలిన్స్ చెప్పుకొచ్చారు