Blood levels : శరీరంలో రక్త హీనత తగ్గాలంటే ఈ పదార్థాలు తినండి
Blood levels : శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండటానికి రక్తం చాలా ముఖ్యం. ఆ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోకుండా ఉండేందుకు ఐరన్ అవసరం అవుతుంది. అందుకే శరీరంలో తగినంత ఐరన్ ఉండాలని డాక్టర్లు ఎప్పుడూ సూచిస్తూ ఉంటారు. ఐరన్ తగ్గితే అనర్థాలు వస్తాయని హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ఈ ఐరన్ ను మనం ఆహార పదార్థాల ద్వారా పొందొచ్చు. అలా ఐరన్ ను పొందలేని పక్షంలో ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇది వయస్సును బట్టి ఒక్కొక్కరు ఒక్కో శాతంలో ఐరన్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
18 ఏళ్లు పైబడిన పురుషులకు రోజుకు 8.7mg ఐరన్ అవసరం ఉంటుంది.
19 నుండి 50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు రోజుకు 14.8mg ఐరన్ తీసుకోవాలి.
50 ఏళ్లు పైబడిన మహిళలుకు రోజుకు 8.7mg ఐరన్ అవసరం ఉంటుంది.
గర్భవతులుగా ఉన్న స్త్రీలకు మరింత ఎక్కువ మొత్తంలో ఐరన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే లోల తయారయ్యే పిండానికి కూడా ఐరన్ అభివృద్ధిలో సహాయపడుతుంది. ఐరన్ లోపం ఉన్న మహిళల్లో రుతుక్రమం ఎక్కువగా వస్తుంది. దీని వల్ల మహిళలు ఎక్కు మొత్తంలో రక్తాన్ని కోల్పోయి రక్తహీనత బారిన పడుతుంటారు. అలాగే శరీరంలో నులి పురుగులు ఉన్నా, పోషకాహార లోపం వల్ల కూడాను ఎక్కువవగా రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్య ఉన్న వాళ్లు పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. అంటే పాలకూర, నువ్వులు బెల్లం వంటివి ఎక్కువగా తినాలి. అలాగే క్యాబేజీ కాడలు కూడా రక్తంలో ఐరన్ శాతం పెరిగేందుకు దోహదం చేస్తాయి. పల్లె టూర్లలో లభించే దంపుడు బియ్యం తినడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల.. వాటిని తీసుకుంటే మంచిదని అంటారు.
అలాగే కొన్ని ఆహార పదార్థాలు ఐరన్ రిచ్ ఫుడ్స్ గా పిలువబడుతుంటాయి. అలాంటి ఫుడ్ తీసుకుంటే కూడా రక్తంలో ఐరన్ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా ఐరన్ ను పొందడానికి ఆహారం తీసుకుంటేనే మంచిది. కానీ ఐరన్‌ను పొందడం కోసం కాఫీ, లేదా టీ తాగడం లేదా కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు పానీయాలు తీసుకోవడం తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. కాల్షియం కూడా శరీరంలో ఐరన్ గ్రహించడంలో అంతరాయం కలిగిస్తుంది. మీ ఐరన్ శోషణను మెరుగు పరచుకోవడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిని తినండి. ఆరెంజ్ జ్యూస్, బ్రకోలీ లేదా స్ట్రాబెర్రీలు, జామ, ఉసిరి వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అన్నం తిన్న తర్వాత విటమిన్ సి ఉండే పండ్లను తీసుకుంటే.. అవి ఐరన్ శరీరానికి అందించేందుకు తోడ్పడతాయి.