Tulasi Drink : పరిగడుపున తులసి నీరు తాగితే ఆ సమస్యలన్నీ మటాష్…!
Tulasi Drink : పరిగడుపున తులసి నీరు తాగితే కొన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మరి వాటి గురించి తెలుసుకుందాం.. మన భారతీయ సాంప్రదాయంలో తులసి చెట్టును లక్ష్మీదేవిగా పూజిస్తారు. అందుకే ప్రతి ఇంటి ముందు తులసి చెట్టుని పూజిస్తూ అమ్మవారిగా భావిస్తూ ఉంటారు. తులసి చెట్టును పూజించడమే కాదు.. తులసి ఆకుల్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే జలుబు దగ్గు, జలుబు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు తులసి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
తులసి నీటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ పెరగదు. వర్షాకాలంలో పసుపు, తులసి కషాయాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఈ తులసి నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కడుపులో ఎస్టిటి ఉన్నవారు ప్రతిరోజు రెండు నుంచి మూడు తులసి ఆకులు తినాలి. కొబ్బరినీళ్లు, తులసి ఆకులు, నిమ్మరసం కలిపి తాగితే కడుపునొప్పి నుంచి అలాగే తులసి టీ లేదా కషాయం తాగడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.
అలాగే సీజనల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. రోజు తీసుకునే ఆహారంలో తులసి ఆకులను తీసుకోవడం వల్ల వ్యాధులు అనేవి దరిచేరవు. గొంతు నొప్పి ఉన్నప్పుడు తులసి నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తులసినీరు తాగవచ్చు.. దీనివల్ల బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే శరీరంలోని విష పదార్థాలు బయటికి వస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సమస్యలు కూడా తగ్గుతాయి. మలబద్దకం, విరేచనాల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కడుపు కూడా క్లీన్ అవుతుంది. ఉదయాన్నే ఈ నీరు తాగడం వల్ల జ్వరం వైరల్ ఫీవర్సు దరిచేరవు…