Tulsi Tips : తులసిని ఎలాంటి సమయంలో తాకకూడదు… ఈ నియమాలను తప్పకుండా తెలుసుకోవాలి…!!
Tulsi Tips : హిందూ సాంప్రదాయాలలో తులసిని ఎంతో గొప్పగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ తులసిని సాక్షాత్ లక్ష్మీదేవి రూపంగా పూజిస్తూ ఉంటారు. కావున చాలామంది ఇంట్లో తులసి మొక్కలు తప్పకుండా ఉంటాయి. ఈ తులసి మొక్కకు స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి తులసి మొక్కకి నీటిని పోసి ఆరాధిస్తూ ఉంటారు. ఇంట్లో నాటిన మొక్క సానుకూల శక్తిని పెరిగేలా చేస్తుంది. దీని మూలంగా ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, సంపదతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆయుర్వేదంలో మంచి ఔషధంగా దీన్ని వాడుతూ ఉంటారు. అయితే ఈ తులసి విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ప్రధానంగా తులసిని పట్టుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో తులసిని ముట్టుకోకూడదు..
ఇప్పుడు ఆ నియమాలేంటో మనం చూద్దాం… తులసి ఆకులతో వినాయకుడిని, శివున్ని పూజించకూడదని ఒక నమ్మకం. తులసి ఆకుల్ని లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. అలాగే విష్ణుమూర్తికి కూడా సమర్పించవచ్చు. తులసి ఆకులతో ఈ ఇద్దరు దేవుళ్ళకి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతుంటారు. అలాగే ఇంట్లో సుఖ సంతోషాలు కూడా వెల్లివిరిస్తాయి.. తులసి మొక్కను ప్లాస్టిక్ కుండీ లో పెంచడం అసలు మంచిది కాదు. తులసి మొక్కకు మట్టి కుండలో మాత్రమే పెట్టాలి. పసుపు నిమ్మరసం మిశ్రమంతో ఈ కుండీ పై శ్రీకృష్ణుడి పేరు రాయడం చాలా మేలు జరుగుతుంది. అలాగే మురికి చేతులతో తులసి మొక్కను తాకకూడదు. చేతులు కడుక్కున్న తర్వాతే తులసి మొక్కను ముట్టుకోవాలి.
ఒకవేళ తులసి పూజ చేస్తున్నట్లయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే దీనిని ఆరాధించాలి. ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంటికి తులసి మొక్కను తీసుకురాకూడదు. గురువారంనాడు తులసి మొక్కను తీసుకురావడం మంచిదట గురువారంనాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. తులసి మహావిష్ణువు ఇష్టమైనది కావున గురువారంనాడు తులసిని ఇంటికి తీసుకొస్తే అన్ని శుభాలే కలుగుతాయి. రాత్రి సమయంలో తులసి మొక్కలకు నీరు పోయనే పోయకూడదు. అలాగే ఆకుల్ని కూడా తెంపకూడదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం పూట తులసి మొక్కను అసలు ముట్టవద్దు..