Alcohol : ఆల్కహాల్ తాగడం వలన ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Alcohol : ఆల్కహాల్ తాగడం వలన ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసా…!

Alcohol : ప్రస్తుత కాలంలో యువత మద్యానికి బానిసలు అయ్యారు.అయితే మద్యం సేవించడం వలన ఎటువంటి ప్రయోజనాలు అనేవి ఉండవు. పైగా విటికి బదులుగా లేనిపోని రోగాలు అనేవి వచ్చి పడతాయి. అయితే ఎవరైనా సరే వారానికి ఒకసారి మద్యం తాగిన వారికి కూడా ప్రతి రోజు తాగితే శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో అంతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆల్కహాల్ అనేది జీవిత కాలాన్ని కూడా నియంత్రిస్తుంది. అలాగే క్యాన్సర్ ప్రమాదాలను కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Alcohol : ఆల్కహాల్ తాగడం వలన ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసా...!

Alcohol : ప్రస్తుత కాలంలో యువత మద్యానికి బానిసలు అయ్యారు.అయితే మద్యం సేవించడం వలన ఎటువంటి ప్రయోజనాలు అనేవి ఉండవు. పైగా విటికి బదులుగా లేనిపోని రోగాలు అనేవి వచ్చి పడతాయి. అయితే ఎవరైనా సరే వారానికి ఒకసారి మద్యం తాగిన వారికి కూడా ప్రతి రోజు తాగితే శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో అంతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆల్కహాల్ అనేది జీవిత కాలాన్ని కూడా నియంత్రిస్తుంది. అలాగే క్యాన్సర్ ప్రమాదాలను కూడా ఎంతగానో పెంచుతుంది. ఈ క్యాన్సర్ వెనుక ఉన్నటువంటి ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, మద్యం సేవించడం వలన కూడా క్యాన్సర్ కణాలు అనేవి ఏర్పడతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఆల్కహాల్ నోటి మరియు గొంతు క్యాన్సర్ ప్రమాదలను కూడా ఎంతగానో పెంచుతుంది. అలాగే సిగరెట్ల లాగే ఆల్కహాల్ కూడా శరీరంపై క్యాన్సర్ ప్రభావాలను తీవ్రం చేయగలదు…

ఆల్కహాల్ సేవించటం వలన క్యాన్సర్ ప్రమాదాలు అధికంగా పెరిగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కువ కాలం తాగే వారిలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వలన కాలేయం కూడా తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాక ఆల్కహాల్ కాలేయంలో ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ లాంటి వ్యాధులకు కూడా దారి తీయవచ్చు. దీనితో పాటుగా మద్యం సేవించడం వలన లివర్ క్యాన్సర్ కణాలు కూడా ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Alcohol ఆల్కహాల్ తాగడం వలన ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసా

Alcohol : ఆల్కహాల్ తాగడం వలన ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయో తెలుసా…!

కోలోరెక్టల్ లేక మల క్యాన్సర్ కు కూడా ఆల్కహాల్ ఒక కారణం అని చెప్పొచ్చు. అలాగే ఆల్కహాల్ తాగే వారికి పురుష నాళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని అధ్యయనాలు తెలిపాయి. అయితే మద్యం తాగడం వలన కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అని అంటున్నారు. ఈ కడుపు క్యాన్సర్ కు ఆల్కహాల్ కూడా ఒక ముఖ్య కారణం. క్యాన్సర్ ప్రమాదాలను నియంత్రించేందుకు మధ్యన్ని పూర్తిగా మానేయటం ఒకటే మార్గం…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది