Gongura : గోంగూరలో మటన్ లో ఉన్న విటమిన్స్… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gongura : గోంగూరలో మటన్ లో ఉన్న విటమిన్స్… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 February 2025,9:00 am

Gongura : మనం ఎక్కువగా ఆకుకూరలు తింటూనే ఉంటాం. అందులో ఆకుకూరలకే రారాజు గోంగూర. ఈ గోంగూర ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను ఇస్తాయి. గోంగూర తినడం కేవలం రుచి కోసమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుట కొరకు కూడా. గోంగూరని వారానికి 2,3 సార్లు నిరసందేహంగా తినవచ్చు. ఈ పుల్లటి గోంగూర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు…. ఈ గోంగూర వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం…

Gongura గోంగూరలో మటన్ లో ఉన్న విటమిన్స్ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

Gongura : గోంగూరలో మటన్ లో ఉన్న విటమిన్స్… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు…?

Gongura గోంగూర లో పోషక విలువలు

గోంగూర లో పోషక విలువలు మటన్ లో ఉన్న పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ గోంగూరని తింటే మటన్ తిన్నంత బలం మన శరీరానికి అందుతుంది. ఈ గోంగూరలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ గోంగూరను స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే ఇంకా మంచిది. ఈ గోంగూరలో విటమిన్ సి, విటమిన్ బి2, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి9, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, రైబో ఫ్లెవిన్, కెరోటిన్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ కూడా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను ఇస్తాయి. అయితే ప్రతిరోజు కూడా గోంగూర తింటే… జీర్ణక్రియ చాలా ఆరోగ్యంగా పనిచేస్తుంది. అన్నం తిన్న ఆహారం తొందరగా జీర్ణం చేస్తుంది. గోంగూరిలో క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే గోంగూర సమర్థవంతంగా పనిచేస్తుంది.

Gongura గోంగూరతో వ్యాధులు నివారణ

గోంగూర తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల, రక్తహీనత సమస్యతో బాధపడే వారికి గోంగూర ఒక మంచి దివ్య ఔషధం. ఈ రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది. ఈ గోంగూర లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. గోంగూరను తినడం వల్ల, దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడే వారికి గోంగూర మంచి ఔషధం పోతున్నారు వైద్య నిపుణులు. జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తుంది. జుట్టుని ఒత్తుగా బలంగా మారుస్తుంది. గోంగూరలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోజువారి కావలసిన విటమిన్ సి తో 53% గోంగూరలు ఉంటుంది. అవునా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గోంగూర తినడం వల్ల మహిళలకు మాత్రం ముఖ్యంగా ఎదురయ్యే పిరియడ్స్ నొప్పి నుంచి గోంగూర ఉపశమనాన్ని కలిగిస్తుంది. గోంగూరలో, పొటాషియం, మెగ్నీషియం లో ఉంటాయి. ఈ గోంగూర తినడం వల్ల హై బీపీ సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి బీపీ పేషెంట్లు గోంగూరను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. గోంగూర లో ఉన్న విటమిన్స్ వలన ఎముకలను దృఢంగా ఉంచుతుంది. విరిగిన ఎముకలను త్వరగా అతుక్కునేలా చేయడంలో కూడా గోంగూర ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ గోంగూరలో క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాలు పెరుగుదలని కూడా కంట్రోల్ చేస్తాయి. అంతేకాదు గోంగూరను ఎక్కువగా తింటే కళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది .

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది