Walking for Good Health : రోజులో 30 నిమిషాలు ఇలా చేయండి.. ఏ రోగం దరిచేరదు.. కచ్చితంగా ఈ మార్పు మీరు గమనిస్తారు..!
Walking for Good Health : ప్రస్తుతం ఆధునిక జీవన శైలి వల్ల ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కడుపునిప్పి, గుండె సంబందిత వ్యాధులు, ఫ్యాటీ లివర్, యురిక్ యాసిడ్, ఊబకాయం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పనిభారం వల్ల చాలామందికి ఒత్తిడి కలుగుతుంది. దాని వల్ల ఎక్కడికి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే శరీరం చురుకుగా ఉండట్లేదు. అందుకే కాస్త […]
ప్రధానాంశాలు:
Walking for Good Health : రోజులో 30 నిమిషాలు ఇలా చేయండి.. ఏ రోగం దరిచేరదు.. కచ్చితంగా ఈ మార్పు మీరు గమనిస్తారు..!
Walking for Good Health : ప్రస్తుతం ఆధునిక జీవన శైలి వల్ల ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కడుపునిప్పి, గుండె సంబందిత వ్యాధులు, ఫ్యాటీ లివర్, యురిక్ యాసిడ్, ఊబకాయం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పనిభారం వల్ల చాలామందికి ఒత్తిడి కలుగుతుంది. దాని వల్ల ఎక్కడికి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే శరీరం చురుకుగా ఉండట్లేదు. అందుకే కాస్త టైం వ్యాయాం లేదా కొంతలో కొంత వాకింగ్ అనేది చాలా అవసరం అని వైద్యులు చెబుతున్నారు. నడకకు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. తగినంత సమయం వాకింగ్ చేస్తే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. శారీరక ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాకింగ్ అనేది చాలా అవసరం. మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. ప్రతిరోజు 30 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.
Walking for Good Health బరువు తగ్గే ఛాన్స్..
రోజు 30 నిమిషాలు వాకింగ్ చేతే బరువు తగ్గుతారు. ప్రతిరోజు కొదిసేపు వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజు 30 నిమిషాలు నడిస్తే పక్షవాతం, రక్తపోటు, టైప్ 2 మధుమేహం లాంటి వ్యాధులు రావు. వాకింగ్ వల్ల ఎముకలు బలపడతాయి. ఎముకలు దృఢంగా అవ్వడంతో పాటు కండరాలు కూడా బలపడేలా చేస్తాయి. కండరాల తిమ్మిరి, కీళ్ల నొప్పులు పరిష్కరించబడతాయి.
డయాబెటిస్ పేషెంట్స్ కూడా వాకింగ్ చేయడం వల్ల షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా రక్తపోటు తగ్గించడంలో కూడా వాకింగ్ ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు వాకింగ్ సహకరిస్తుంది. సో ఇన్ని లాభాలు ఉన్న వాకింగ్ చేయడానికి ట్రై చేయాల్సిందే. 30 నిమిషాల రోజు వాకింగ్ చేయడం వల్ల శరీరంలో మార్పులు అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తాయి.