Blood Pressure : బీపీని ఆహారంతో కంట్రోల్ చేయాలనుకుంటున్నారా.? అయితే వీటిని మీ డైట్ లో చేర్చితే చాలు…!!
Blood Pressure : ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న వ్యాధి బీపీ. దీనిని కంట్రోల్ చేయడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అయితే దీనికి కారణం ఉప్పు మాత్రమే కాదు.. చక్కెర కూడా బీపీని పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, కూల్డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వలన ఊబకాయం పెరుగుతుందని ఓ పరిశోధనలో బయటపడింది. ఇది అధిక రక్త పోటు కు కారణం అవుతుంది. అత్యధిక శాతం మంది భారతదేశంలోని ఉన్నారు అని పరిశోధనలు వెల్లడించాయి. అనారోగ్యకరమైన ఆహారపులవాట్లు మీ రక్తపోటు పై ప్రధానంగా ఎఫెక్ట్ పడుతున్నాయి. కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అధిక రక్తపోటు
ఇబ్బంది పడే వారికి కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. అధిక రక్తపోటు రోగులకు ఉత్తమ ఆహారాలు ఇవే… *పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్: అరటి పండ్లు పొటాషియం లభించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. *డ్రై ఫ్రూట్స్; బాదం, పొత్తు తిరుగుడు, గింజలు, బీన్స్ వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కావున మధుమేహం రోగులు వీటిని మితంగా తీసుకోవడం మంచిది. *చేపలు: బిపి ఉన్నవారికి మాంసాహారంలో చేపలు చాలా మంచిది. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కావున గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
*ధాన్యాలు; తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. బ్రౌన్ రైస్ లాంటి తృణధాన్యాలు తీసుకుంటే మంచిది. వెన్న, క్రీమ్, చీజ్ లాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. *వీటికి దూరంగా ఉండాలి; మద్యం తాగడం: అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. *మినరల్ వాటర్; బాటిల్ మినరల్ వాటర్ తీసుకోవడం వల్ల బిపి రోగులకు కూడా హాని కలుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది లీటర్ మినరల్ వాటర్ లో 200 ఎంజి సోడియం కలిగి ఉంటుంది. *ఊరగాయలకు దూరంగా ఉండాలి: ఉప్పు తీసుకోవడం అసలు మంచిది కాదు.. ఎందుకంటే నిల్వ ఉండాలని పచ్చళ్లలో ఉప్పు అధికంగా వాడుతూ ఉంటారు.