Diabetes : ఈ ఆకులతో డయాబెటిస్ కంట్రోల్.. ప్రయోజనాలు కూడా ఎక్కువే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : ఈ ఆకులతో డయాబెటిస్ కంట్రోల్.. ప్రయోజనాలు కూడా ఎక్కువే..

 Authored By mallesh | The Telugu News | Updated on :14 February 2022,7:00 am

Diabetes : ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఒకప్పుడు వయస్సు మీదపడిని వారికి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చేది. కానీ ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది దీని బారిన పడుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు బిజీ లైఫ్ కారణంగా ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి సోకిన వారు జీవితాంతం మందులు వాడక తప్పదు. మరి ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి కొన్ని నేచురల్ పద్దతులు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.

ఇంట్లో మనం తయారు చేసుకునే హెర్బల్ డ్రింక్స్ మనకు చాలా హెల్ప్ చేస్తుంటాయి. డయాబెటిస్ కంట్రోల్ కోసం ప్రస్తుతం చెప్పే టిప్స్ లో ఏదో ఒకదాన్ని ప్రతి రోజూ ఫాలో అతి మంచి ఫలితం ఉంటుంది. తులసి ఆకులు డయాబెటిస్‌ను నియంత్రించడంలో చాలా సహాయపడతాయి. ఏడు నుంచి ఎనిమిది తులసి ఆకులు నీటిలో బాగా మరింగించాలి. ఆ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. దీనితో పాటు వేప ఆకులు సైతం డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తాయి. నాలుగు వేపాకులను నీటిలో బాగా మరిగించాలి.

ways to control diabetes

ways to control diabetes

Diabetes : తులసి, కరివేపాతో ఎంతో మేలు

తర్వాత ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉల్లిపాయను సన్నగా కోసి మిక్సీలో పట్టాలి. తర్వాత దానిని నుంచి వచ్చిన రసాన్ని తీసుకోవాలి. దానిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. అందులో కొంచెం నిమ్మ రసాన్ని పిండాలి. కొద్దిగా ఉప్పు సైతం కలిసి తీసుకోవాలి. దీని వల్ల బాడీ డయాబెటిస్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. వీటిని వాడేటప్పుడు షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల రిజల్ట్ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పిన వాటిలో ఏదో ఒక టిప్ ను రెగ్యులర్ గా ఫాలో అయితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది