Weight loss : ఈ ఆహార పదార్థాలు తినండి చాలు… ఒంట్లో కొవ్వు ఐస్ ల కరిగిపోతుంది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Weight loss  : ఈ ఆహార పదార్థాలు తినండి చాలు… ఒంట్లో కొవ్వు ఐస్ ల కరిగిపోతుంది…

 Authored By ramu | The Telugu News | Updated on :22 June 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Weight loss  : ఈ ఆహార పదార్థాలు తినండి చాలు... ఒంట్లో కొవ్వు ఐస్ ల కరిగిపోతుంది...

Weight loss  :  ప్రస్తుత కాలంలో గజిబిజి జీవన శైలి కారణం వలన ప్రతి ఒక్కరు కూడా ఊబకాయ సమస్యతో ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలి అంటే బరువును అదుపులో ఉంచుకోవాలి. దీనితో బరువు తగ్గటంకోసం కొందరు ఎన్నో రకాల తిప్పలు పడుతూ ఉంటారు. బరువు తగ్గాలి అంటే ఆహారం, వ్యాయామం అన్నీ కూడా కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన సహజ పద్ధతుల్లో శరీర బరువును సులువుగా తగ్గించవచ్చు.మన రోజువారి ఆహారంలో కొన్ని రకాల కూరగాయలను తీసుకోవడం వలన బరువు అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ కూరగాయలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

అలాంటి కూరగాయలలో ముఖ్యమైనవి సొరకాయ. దీనిలో 92 శాతం వరకు నీరు అనేది ఉంటుంది. ఈ కూరగాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అయితే ప్రతిరోజు రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ సొరకాయ రసం గనక తీసుకున్నట్లయితే మన శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. మరొక కూరగాయ ఏమిటి అంటే. కాకరకాయ. కాకరకాయను చాలా మంది ఇష్టపడరు. నిజానికి దీనిలో పీచు పదార్థాలు అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయి.దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. మధుమేహం హృద్రోగులు బరువు తగ్గాలి అనుకున్నట్లయితే ప్రతిరోజు ఈ కాకరకాయను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. ఇది కొవ్వును కరిగించటమే కాక రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది…

Weight loss ఈ ఆహార పదార్థాలు తినండి చాలు ఒంట్లో కొవ్వు ఐస్ ల కరిగిపోతుంది

Weight loss  : ఈ ఆహార పదార్థాలు తినండి చాలు… ఒంట్లో కొవ్వు ఐస్ ల కరిగిపోతుంది…

ఈ కూరగాయలలో ఒకటి. టమాటో. టమాటో లోని మినరల్స్, విటమిన్లు,ప్రోటీన్లు, ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కూరగాయలలో నీటి శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిలో కేలరీలు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. విటమిన్ సి టమాటలో ఎంతో పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా ఎంతో బాగా మెరుగుపరుస్తుంది. దీనితో పాటు బరువు తగ్గాలి అనుకునేవారు క్యారెట్ కూడా తీసుకుంటే చాలా మంచిది. దీనిలో క్యాలరీలు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. క్యారెట్ లో విటమిన్ A అనేది కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. ఇది జీర్ణం అయ్యేందుకు కూడా టైం పట్టదు. కాబట్టి ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది. కావున ఆకలిని కూడా నియంత్రిస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది