West Nile Virus : మానవులపై దాడి చేస్తున్న వేస్ట్ నైల్ వైరస్… ఈ వ్యాధి తీవ్రత లక్షణాలు ఎలా ఉంటాయంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

West Nile Virus : మానవులపై దాడి చేస్తున్న వేస్ట్ నైల్ వైరస్… ఈ వ్యాధి తీవ్రత లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

West Nile Virus : యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వివరాల ప్రకారం చూసినట్లయితే,జులై చివరికి వచ్చేసరికి 8 దేశాలలో 69 కేసులు నమోదు అయ్యాయి. అయితే గ్రీన్,ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో ఎనిమిది మరణాలు కూడా ఈ వైరస్ కారణంగా సంభవించాయి. అయితే ఈ గ్రీన్ మరియు స్పెయిన్ లో కేసుల సంఖ్య పోయిన సీజన్ కంటే అధికంగా ఉన్నప్పటికీ, ఇన్ఫెక్షన్ సంఖ్య ఈసీడీసీ అంచనాలకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే 2024 […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 August 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  West Nile Virus : మానవులపై దాడి చేస్తున్న వేస్ట్ నైల్ వైరస్... ఈ వ్యాధి తీవ్రత లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

West Nile Virus : యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వివరాల ప్రకారం చూసినట్లయితే,జులై చివరికి వచ్చేసరికి 8 దేశాలలో 69 కేసులు నమోదు అయ్యాయి. అయితే గ్రీన్,ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలలో ఎనిమిది మరణాలు కూడా ఈ వైరస్ కారణంగా సంభవించాయి. అయితే ఈ గ్రీన్ మరియు స్పెయిన్ లో కేసుల సంఖ్య పోయిన సీజన్ కంటే అధికంగా ఉన్నప్పటికీ, ఇన్ఫెక్షన్ సంఖ్య ఈసీడీసీ అంచనాలకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే 2024 అమెరికాలో 26 రాష్ట్రాలలో 100కు పైగా కేసులనేవి నమోదు అయ్యాయి. అలాగే నివేదికల ప్రకారం చూసినట్టయితే, యునైటెడ్ స్టేట్స్ లో వెస్ట్ నైల్ ఇన్ఫెక్షన్ లు ఆగస్టులో చారిత్రాత్మకంగా చోటు చేసుకున్నాయి అని తెలుస్తుంది. ఈ వెస్ట్ నైల్ వైరస్ ను డబ్ల్యూ ఎన్ వీ అని పిలిచే డెంగ్యూ మరియు ఎల్లో ఫీవర్, జికా లాంటి అదే జాతికి చెందినటువంటి సింగిల్ స్టాండేడ్ ఆర్ఎన్ఏ ఆర్థోఫ్లావి వైరస్. ఈ వైరస్ సోకినటువంటి మానవులు ఇన్ఫెక్షన్ నుండి తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కామన్ హౌస్ దోమ ఈ వెస్ట్ నైల్ వైరస్ వ్యాపించేలా చేస్తుంది. ఇది ఫస్ట్ ఆఫ్రికాకు చెందిన వైరస్. కానీ తర్వాత ఈ వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ వైరస్ ప్రస్తుత సబ్ సహారా మరియు ఉత్తర ఆఫ్రికా లో మాత్రమే కాక ఐరోపా మరియు మధ్య ఆసియా మరియు ఉత్తర యునైటెడ్ స్టేట్ అంతటా కూడా వ్యాపించింది.

ఈ డబ్ల్యు ఎన్ వీ వ్యాపింప చేసే వివిధ క్యూలెక్స్ జాతులు ఆసియా ఫస్ ఫిక్ మరియు దక్షిణ ఆసియా అమెరికాతో సహా ప్రపంచంలో దక్షిణ ప్రాంతమంతా కూడా ఈ వైరస్ వ్యాపించింది. ఈ క్యూలక్స్ అనే దోమలు ఇతర జంతువులను కుట్టినప్పుడు డబ్ల్యూ ఎన్ వైరస్ కు వాహకాలుగా పనిచేస్తాయట. దీంతో మానవులు మరియు ఇతర క్షీరదాలతో పాటు పక్షులు కూడా ఈ వైరస్ కు గురి అవుతాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందడానికి కారణం వలస జాతి పక్షులే.వెస్ట్ నైల్ వైరస్ లక్షణాలు ప్రమాదాలు : ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం చూసినట్లయితే, ఎంతో మందికి డబ్ల్యూ ఎన్ వీ సంక్రమణ లక్షణాలు అనేవి కనపడవు. ఇవి చాలా తక్కువ సంర్భాలలో మాత్రమే ఒక వ్యక్తి వెస్ట్ నైల్ ఫీవర్ తో ఇబ్బంది పడవచ్చు. ఇవి తలనొప్పి, బద్ధకం, వికారం, అనారోగ్యం, శోషరస కణుపుల వాపుకు కూడా కారణం అవుతుంది.

అయితే ఎన్నో సందర్భాలలో ఈ లక్షణాలు అనేవి వారం రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ ఈ లక్షణాలు అనేవి మరింత తీవ్రం అయినప్పుడు నిర్దిష్ట సంరక్షణ చాలా అవసరం అవుతుంది. అయితే వన్ పర్సన్ కంటే చాలా తక్కువ కేసులలో రోగి వెస్ట్ నైల్ వైరస్ వ్యాపించటంతో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ పై కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే మెనింజెటిస్ మరియు ఎన్స్ ఫాలిటిస్ లేక అక్యూడ్ ఫ్లాసిడ్ మైలిటిస్ కు కూడా కారణం కావచ్చు. ఇవన్నీ కూడా ఎంతో ప్రాణాంతకమైన లేక దీర్ఘకాలిక పరిణామాలను కూడా కలిగి ఉండవచ్చు. అయితే వృద్ధులు మరియు అధిక రక్తపోటు లేక రక్త సమస్యలు మరియు డయాబెటిస్ మూత్రపిండాల కు సంబంధించిన వ్యాధి లేక మద్యపానం తాగే వారు కూడా అనారోగ్యానికి గురవుతారు…

West Nile Virus మానవులపై దాడి చేస్తున్న వేస్ట్ నైల్ వైరస్ ఈ వ్యాధి తీవ్రత లక్షణాలు ఎలా ఉంటాయంటే

West Nile Virus : మానవులపై దాడి చేస్తున్న వేస్ట్ నైల్ వైరస్… ఈ వ్యాధి తీవ్రత లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

నివారణ చికిత్స : ప్రస్తుతానికి ఈ డబ్ల్యూ ఎన్ వీ ను నివారించడానికి వ్యాక్సిన్ అనేది లేదు. కావున దోమలు కుట్టకుండా చూసుకోవాలి. అలాగే శరీరమంతా కూడా బట్టలను ధరించాలి మరియు దోమతెరలు లాంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దోమలను నివారించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ వ్యాధిని అరికడితేనే వ్యాధి అనేది రాకుండా ఉంటుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది