Curd : కొన్ని రకాల ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curd : కొన్ని రకాల ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :23 September 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Curd : కొన్ని రకాల ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా...!!

Curd : భారతీయ సాంప్రదాయాలలో భోజనం చేసిన తర్వాత చివరిలో పెరుగుతో అన్నం తినకపోతే తిన్న అనుభూతి కలగదు. అలాగే ఇతర రకాల వంటలలో కూడా పెరుగును ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. దీనితో శరీరానికి కలిగే పోషకాలు అన్ని ఇన్ని కావు. అయితే పెరుగు తినడం వలన ఎముకలు మరియు కండరాలు బలంగా ఉంటాయి. అలాగే ఒత్తిడి మరియు ఆందోళన లాంటివి కూడా చాలా వరకు అదుపులో ఉంటాయి. అంతేకాక ఇమ్యూనిటీని పెంచడంలో పెరుగు ఎంతో చక్కగా పని చేస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలతో కలిపి పెరుగును తీసుకోవటం అసలు మంచిది కాదు. మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

మామిడి పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవటం అస్సలు మంచిది కాదు. ఈ రెండిటిని కలుపుకొని తీసుకోవటం వలన కడుపులో నొప్పి మరియు అజీర్తి సమస్యలు వస్తాయి. అలాగే అరటి పండ్లను కూడా పెరుగులో కలుపుకొని తినకూడదు. అయితే ఈ పెరుగు అన్నంలో అరటిపండు ను కలుపుకొని చాలామంది తింటూ ఉంటారు. కానీ ఇలా చేయటం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. అలాగే మటన్ మరియు చికెన్, ఫిష్ లాంటి ఆహారాలను తిన్న తర్వాత కూడా ఎంతోమంది వేడి చేస్తుంది అనే ఉద్దేశంతో పెరుగును తింటూ ఉంటారు. ఈ మాంసాహార పదార్థాలు తిన్న తర్వాత పెరుగును తినడం మంచిది కాదు. ఇలా చేయటం వలన జీర్ణ సమస్యలు అనేవి వస్తాయి. అలాగే కడుపునొప్పి మరియు అజీర్తి సమస్యలు కూడా వస్తాయి…

Curd కొన్ని రకాల ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా

Curd : కొన్ని రకాల ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా…!!

అలాగే కీరదోస మరియు గింజలు, జొన్న వేయించిన ఆహార పదార్థాలతో కూడా పెరుగును తినడం మంచిది కాదు. ఈ రెండిటిని కలిపి తీసుకోవటం వలన చలువ చేసి జలుబు అనేది వస్తుంది. అలాగే సైనస్ మరియు దగ్గు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటమే మంచిది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది