sleeping problems : నిద్రకు – ఆహారానికి లింకేంటి… సరైన నిద్రలేనప్పుడు ఏం తినాలి.. ఏం తినోద్దు
sleeping problems : మనం తీసుకునే ఆహారం అనేది మనం ప్రశాంతంగా నిద్రపోయే దానిమీదే ఆధారపడి ఉంటుంది. వినటానికి కొంచం విచిత్రంగా అనిపిస్తున్న కానీ అదే నిజం. రాత్రి సరైన నిద్ర అనేది లేకపోతే తర్వాతి రోజు మనము తీసుకునే ఆహారం కంటే ఎక్కువ కేలరీస్ తీసుకోవటం జరిగింది. పైగా సరైన నిద్ర లేకపోవటం వలన నడుము సమస్య వస్తుంది. పైగా మీరు ఆరోగ్యం కోసం పాటించే విధానాన్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది.
నిద్రకు – ఆహారానికి లింకేంటి..?
నిద్ర అనేది మనిషి జీవన చక్రంలో చాలా ముఖ్యమైంది. రోజుకు 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది మరియు బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. అదే సమయంలో సరైన నిద్ర లేకపోవటం వలన విశ్రాంతి జీవక్రియ రేటు (RMR) ను తగ్గిస్తుంది, ఇది మీరు విశ్రాంతిగా ఉన్నప్పుడు మీ శరీరం ఖర్చుచేసే కేలరీల సంఖ్యగా సూచిస్తారు. అదే కాకుండా నిద్ర లేకపోవటం వలన మీ ఆకలిని పెంచుతుంది.
సరైన నిద్రలేనప్పుడు ఎక్కువ తింటారు
2016 లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ఇచ్చిన నివేదిక ప్రకారం. రాత్రికి తగినంత నిద్ర రాలేని వ్యక్తులు మరుసటి రోజు మామూలు కంటే ఎక్కువగా తింటారు. ఒక వ్యక్తి సగటున కంటే 385 కేలరీలు ఎక్కువగా తింటాడు. నిద్ర లేమి ఉన్నవారు ఎక్కువ కొవ్వు మరియు తక్కువ ప్రోటీన్ తినేవారని అధ్యయనం సూచించింది. పైగా సరైన నిద్రలేని వాళ్లకు జంక్ ఫుడ్ పట్ల ఇష్టం పెరుగుతుందని ఆ నివేదిక తెలిపింది. రోజుకి 385 కేలరీస్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వలన తొమ్మిది రోజుల్లో దాదాపు 500 గ్రామ్స్ వెయిట్ అవకాశం ఉంది. పైగా డైయాబెటిస్ , హైపెర్టెన్షన్ లాంటి వ్యాధులు రావచ్చు.
కాబట్టి రోజుకు సరైన నిద్ర అనేది చాలా అవసరం. రోజు ఖచ్చితంగా 7 నుండి 8 గంటలు నిద్రపోవడానికి ట్రై చేయండి. త్వరగా పడుకోవటం, అదే విధంగా ఉదయాన్నే లేవటం లాంటివి ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేకపోతే అనేక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.